తిరుమలలో వసతి గదుల కోసం ఎదురు చూస్తున్నారా?

తిరుపతి: సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. సోమవారం 66,598 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,103 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.88 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.

బ్రహ్మోత్సవ శోభ..

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరించారు. భక్తులు అడుగడుగునా శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో తిరుమల ఆలయ మాడవీధులు మారుమోగాయి.

TTD officials

వసతి కోసం..

దేశం నలుమూలల నుంచి తిరుమలేశుడిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి గదుల కోటాను ఎప్పుడు విడుదల చేస్తారనేది టీటీడీ అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమలలో వసతి గదుల కోటా బుకింగ్‌ను ఆరంభించనున్నారు.

డిసెంబర్ 1 నుంచి..

డిసెంబర్ నెలకు సంబంధించిన బుకింగ్ కోటా ఇది. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు తిరుమలలో వసతి గదులను పొందడానికి ఉద్దేశించిన కోటా. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అకామడేషన్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కాటేజీలు ఇవే..

తిరుమలలో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీవేంకటేశ్వర అతిథి గృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+