TTD: స్థానిక ఆలయాలలోనూ రథసప్తమి వేడుకలు.. తిరుమలలో భక్తుల రద్దీ ఇలా!!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపై కొలువుదీరిన వరాలయ్య, కోరి కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో రథ సప్తమి వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

అలాగే టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న స్థానిక ఆలయాలలోనూ రథ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించటం కోసం ఏర్పాట్లు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇందులో భాగంగా తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

TTD: Rathasaptami celebrations in local temples too.. Devotees rush in Tirumala today!!

ఈ క్రమంలోనే స్థానిక ఆలయాలలోనూ విశేష పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు ఉదయం భానుని కిరణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటఫలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రథ సప్తమి వేడుకలలో భాగంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ విషయానికి వస్తే నిన్న తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకున్న మొత్తం భక్తుల సంఖ్య 72,256 అని టిటిడి ప్రకటించింది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,021 మంది కాగా, నిన్న ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం 3. 04 కోట్లని పేర్కొంది.

స్వామివారిని దర్శించుకోవడానికి 21 కంపార్ట్మెంట్లలో నిన్న భక్తులు వేచి ఉన్నారని టిటిడి వెల్లడించింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అయితే త్వరలో రథ సప్తమి వేడుకలు జరగనున్న క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+