తిరుమలలో మరో కొత్త రికార్డు - భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!!

Tirumala: తిరుమలలో అతిధి గృహాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చేందుకు ఓ సంస్థ రికార్డు స్థాయి లో చెల్లించింది. హెచ్ వీడీసీలోని 493 అతిధి గృహం నిర్మాణానికి అధికారులు తిరుమలలోని రెవిన్యూ కార్యాలయం లో టెండర్లు నిర్వహించారు. ఇందులో చెన్నైకు చెందిన జీస్క్వేర్ రియల్టర్స్ సంస్త రూ 25,77,77,777 ను విరాళంగా కోట్ చేసింది. నిబంధనల ప్రకారం ఈ సొమ్మంతా టీటీడీకి విరాళంగా వెళ్లనుంది.
ఇది కొత్త రికార్డుగా నమోదైంది. ఇదే సమయంలో తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో వసతి గదులు..అతిధి గృహాల నిర్వహణలో టీటీడీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త వాటి నిర్మాణంతో పాటుగా కొనసాగుతున్న వసతి గృహాల మరమ్మత్తులు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు వీడీసీలోని 493 అతిధి గృహం నిర్మాణానికి రికార్డు స్థాయిలో విరాళం అందింది. ఈ అతిధి గృహాన్ని దాత సొంత ఖర్చులతో నిర్మించి దేవస్థానంకు అందించాలి. అందులో ఒక గదిని దాతకు కేటాయిస్తారు. కంపెనీ పేరిట టెండర్ పొందిన దాతలకు 20 ఏళ్లు, వ్యక్తిగతంగా టెండర్ పొందిన దాతలకు జీవితాంతం ఆ గది అందుబాటులో ఉంటుంది.

TTD Receives Rs 25.77 cr under cottage donation

కొద్ది రోజులుగా తిరుమలలో భక్తులకు వసతి గదుల విషయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మొత్తం 7500 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అందులో రూ 50, రూ 100 గదులు అయిదు వేల వరకు ఉన్నాయి. తాజాగా రూ 120 కోట్లతో ఈ గదులను ఆధునీకరించారు. వాటిల్లో ఫ్లోరింగ్,గ్రీజర్లు వంటివి అందుబాటులోకి తీసుకొచ్చారు. పద్మావతీ,ఎంబిసి కార్యాలయాల్లో ప్రముఖులకు కేటాయిస్తారు. మూడు అతిధి గృహాలకు సంబంధించి గదుల ధరలను ఈ మధ్య కాలంలో పెంచారు. అదే సమయంలో గదుల నియామకంలో పారదర్శకత కోసం గత మార్చి 1వ తేది నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తున్నారు. అక్రమాలకు అడ్డు కట్ట వేసేందుకు ప్రారంభించిన ముఖ గుర్తింపు ఆధారిత సేవలతో గదుల లభ్యత గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు.

ఇదే సమయంలో టీటీడీ మరో నిర్ణయం అమల్లోకి తీసుకొస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ తిరుమలో ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించింది. భక్తులకు రాగి, స్టీల్ నీటి సీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ పద్మావతి విచారణల కేంద్రంలో వంద రాగి, స్టీల్ వాటర్ బాటిల్ రూ 450, స్టీల్ వాటర్ బాటిల్ రూ 200లను ధరలుగా నిర్ణయించింది. ఇక్కడ విజయవంతమైతే తిరుమల వ్యాప్తంగా విచారణ కేంద్రాల్లో బాటిళ్ల అమ్మకాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తిరుమలలో వేసవి రద్దీ వచ్చే వారం నుంచి పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ సమయం లో వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో నియంత్రణ పాటించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+