Tirumala: తిరుమలలో ఆగస్టు 22 నుంచి కారేరిఇష్టి యాగం..
తిరుమలలో ఆగస్టు 22 నుంచి 26 తేదీ వరకు కారేరిఇష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాలు చేస్తున్నట్లు తెలిపింది. కారేరిఇష్ఠి యాగాన్నితిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో రుత్వికులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ యాగాన్ని మొదటగా గణపతి పూజతో ప్రారంభించనున్నారు. ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ అవధాని చూస్తున్నారు.
కారేరిఇష్ఠి యాగాన్ని 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు, రుత్వికులు ఐదు రోజులపాటు ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని టీటీడీ తెలిపింది. కారేరిఇష్ఠి గాన్ని నల్ల వస్త్రాలు ధరించి నిర్వహిస్తారు. మేఘాలను ప్రసన్నం చేసుకోవడానికి నల్లని వస్త్రాలు ధరిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ యాగం వల్ల దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరిస్తున్నారు. యాగంలో బియ్యం, తేనే ఉపయోగించనున్నారు.

ఈ యాగాన్ని ప్రారంభించే ముందు ఓ గుర్రాన్ని, గొర్రెను యజ్ఞగుండం అభిముఖంగా తీసుకొస్తారు. అవి తలలూపిన తరువాత యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. కారీరిఇష్టి యజ్ఞనంలో భాగంగా వరుణ జపం కూడా చేస్తారు. వరుణ మంత్రాన్ని పాఠించి.. వరుణ దేవుడిని ప్రర్థిస్తారు. 26న శాంతి హోమం, మహాపూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. గతంలో కూడా టీటీడీ కారేరిష్టి యజ్ఞం చేసింది. 2017 ఈ యాగాన్ని నిర్వహించారు. 6 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు నిర్వహించనున్నారు.
బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 15 గంటలు పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. కాగా మంగళవారం స్వామివారిని 78 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26,436 మంది తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications