శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు పొందాలంటే - 17వ తేదీ నుంచి ఆ సేవ రద్దు..!!
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు నేడు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ఈ మధ్నాహ్నం మూడు గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో టీటీడీ మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో, శ్రీవారి సేవల్లోనూ మార్పులు చేసింది. కొత్త సంవత్సరం రద్దీ.. వైకుంఠ ఏకాదశి కావటంతో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ పలు నిర్ణయాలను ప్రకటించింది.

నేడు అందుబాటులోకి ఆర్జిత సేవా టికెట్లు..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు నేడు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి ఈ సేవా టికెట్లు టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీటీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించిన సేవా టికెట్లను ఈ రోజు నుంచ భక్తులు బుక్ చేసుకొనే అవకాశం ఏర్పడింది.
ఇదే సమయంలో జనవరి మాసంలో సహజంగా ఉండే రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటుగా.. ఈ నెల 16, 31వ తేదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను మంగళవారం విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచాలని టటీడీ నిర్ణయించింది. ఇప్పటికే తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది.

16వ తేదీ నుంచి ధనుర్మాసం - సుప్రభాత సేవ రద్దు
ఈ నెల 16వ తేది సాయంత్రం నుంచి ధనుర్మాస నెల ప్రారంభం కానుంది. దీంతో, టీటీడీ మరి కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. 17వ తేది నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం బదులుగా స్వామివారికి తిరుప్పావైతో మేల్కోలుపు పలకనున్నారు.
గత సంప్రదాయాలకు కొనసాగింపుగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా, ఆదివారం తిరుమల శ్రీవారిని 72,466 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
28,123 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. సిఫార్సు లేఖలను అనుమతించకూడదని నిర్ణయించారు. అదే సమయంలో సాధారణ భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

వైకుంఠ ద్వారా దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
టీటీడీ ఈ సారి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 2వ తేదీ నుంచి పది రోజుల పాటుగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందు కోసం ముందుగానే టికెట్లు జారీ చేయనున్నారు. దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదు.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 25 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకి 50 వేల టికెట్లు కేటాయిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం పదిరోజుల కి 5 లక్షల సర్వదర్శనం టికెట్లు కేటాయించనున్నారు. సర్వదర్శన టికెట్లు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి 50 వేల టికెట్లు కేటాయిస్తారు.
దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదు. ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేయటంతో, సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం మరింత వేగంగా పూర్తి చేసుకొనే వెసులుబాటు కలిగింది.












Click it and Unblock the Notifications