శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్‌న్యూస్: ఇంకొన్ని గంటల్లోనే..!!
తిరుపతి: కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత వర్చువల్ సేవా టికెట్లను ఇంకొన్ని గంటల్లో ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇవ్వాళ్టి నుంచే శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన 300 రూపాయల టికెట్లను విడుదల చేశారు టీటీడీ అధికారులు. వాటిని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతున్నందున ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు స్పెషల్ దర్శనాలు ఉండవు. ఈ విషయాన్ని ముందే ప్రకటించారు అధికారులు. కాగా- ఈ 10 రోజుల వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ముగియనున్నందున 12వ తేదీ నుంచి 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నారు.

దీనికి అవసరమైన టికెట్లను రెండు రోజులు ముందుగా అంటే ఇవ్వాళే ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ, ఫిబ్రవరి కోటా టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లను కొని- శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోటా టికెట్లను కూడా ఇదివరకే విడుదల చేశారు అధికారులు తెలిపారు.
ఇక తాజాగా- వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లో వాటిని ఉంచనున్నారు. తిరుమల ఆలయంలో శ్రీవారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన వర్చువల్ సేవా, ఇతర దర్శన టికెట్లు ఉదయం 9 గంటల నుంచి ఆన్ లైన్ లో ఉంటాయి.












Click it and Unblock the Notifications