CSK vs DELHI CAPITALS: రెండో విజయంపై ధోని, అయ్యర్ కన్ను, విక్టరీపై ఇరువురి ధీమా
ఐపీఎల్‌లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతోంది. శ్రేయస్ అయ్యర్ టీమ్‌తో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు ఢీ కొట్టబోతోంది. ఇరు జట్లు చెరో విజయంతో దూకుడుగా ఉన్నాయి. కానీ చెన్నై జట్టు మాత్రం ఒక ఓటమి చవిచూడగా.. ఇవాళ్టి మ్యాచే ఢిల్లీ క్యాపిటల్ రెండోది. ఈ ఏడవ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది.

సమ ఉజ్జీలే..?
ఇరు జట్ల బలబలాను చూస్తే సమ ఉజ్జీలుగానే కనిపిస్తారు. చెన్నై టీమ్‌లో వాట్సాన్, బ్రావో, రవీంద్ర జడేజా ఉన్నారు. ఇటు ఢిల్లీలో కూడా శిఖర్ దావన్, అశ్విన్, రిషబ్ పంత్ లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఒక్కరు ఇద్దరు మ్యాచ్‌ను తమవైపు తిప్పగల సమర్థవంతమైన ఆటగాళ్లు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టాండర్డ్ ప్లేయర్స్ కావడంతో.. ఒక్కొక్కరీ యజమాన్యాలు భారీగానే వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ విక్టరీ.. సెకండ్
తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన చెన్నై.. తర్వాత మ్యాచ్‌లో చతికిలపడిపోయింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లకు 6 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసింది. రాయల్స్ బౌలర్ రాహుల్ ట్వేటియా 3 వికెట్లు తీశాడు. కాగా, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ దక్కించుకున్నాడు.

రెండో విజయంపై కన్ను
ఇలా ఉంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లెగ్ అంపైర్ తప్పిదం కారణంగా మ్యాచ్ టై కావడం సూపర్ ఓవర్‌లో తడబాటుకు లోనై పంజాబ్ ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ సునాయసంగా విజయం సాధించి ఐపీఎల్ 2020లో బోణీ కొట్టింది. ఇవాళ మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది.












Click it and Unblock the Notifications