చెన్నుపాటి గాంధీ మెడికల్ రిపోర్ట్ వ్యవహారం-బెజవాడలో టీడీపీ నిరసనలు-పోలీసుల క్లారిటీ..

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై విజయవాడలో వైసీపీకి చెందిన కొందరు రెండు రోజుల క్రితం దాడి చేశారు.పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద గాంధీని వైసీపీ వర్గీయులు చితకబాదారు. ఈ దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి తీవ్ర గాయాలు కావడంతో తాడిగడప ఎల్‍వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. వైసీపీ నేత అవినాష్ వర్గీయులే ఈ దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో తొమ్మిదో డివిజన్ నుంచి గాంధీ భార్య గెలిచారు. ఆమె చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి ఈశ్వర ప్రసాద్ అనుచరులు, కార్యకర్తలు గాంధీపై ఇప్పుడు దాడి చేసినట్లు టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ కేసులో పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అలాగే మెడికల్ రిపోర్ట్ లేకుండానే పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నుపాటి గాంధీ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఇవాళ విజయవాడ పటమట పోలీసుస్టేషన్ వద్ద నిరసనకు దిగారు.

after tdp protests, vijayawada police clarified on chennupati gandhis medical report

గాయం నివేదిక లేకుండా కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన తీరుపై నిరసన చేపట్టారు. ఎఫ్ఐఆర్ కాపీలు, వైద్యుల నివేదికలతో పోలీసుస్టేషన్ వద్ద టీడీపీ నిరసనకు దిగింది. విజయవాడ టీడీపీ కార్యాలయం నుంచి స్టేషన్ కు ర్యాలీగా వచ్చిన నేతలు అక్కడే కాసేపు నిరసన చేపట్టారు. అయితే పోలీసులు మధ్యాహ్నం దీనిపై స్పందించారు.

విజయవాడ ఏసీపీ కార్యాలయం ఈ వ్యవహారంపై ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సరైన పత్రాలు సమర్పించలేదన్న వార్తలు పూర్తి అవాస్తవమని ఈ ప్రకటనలో తెలిపారు. దాడిలో విజయవాడ యల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన చెన్నుపాటి గాంధీ మెడికల్ రిపోర్ట్, డాక్టర్ వాంగ్మూలం, ధ్రువీకరణ పత్రం మేజిస్ట్రేట్ ముందు ఉంచామన్నారు.

after tdp protests, vijayawada police clarified on chennupati gandhis medical report

సెక్షన్ 326 IPC క్రింద ఫైనల్ మెడికల్ రిపోర్ట్ ను మేజిస్ట్రేట్ కోరారన్నారు. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్ యల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారని, చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో ఫైనల్ మెడికల్ రిపోర్ట్స్ ఇంకా అందలేదని పోలీసులు వెల్లడించారు. బాధితుడి చికిత్స పూర్తి అయ్యి, డిశ్చార్జ్ అయిన తర్వాత ఫైనల్ మెడికల్ రిపోర్ట్ అందుతుందన్నారు.
ఫైనల్ మెడికల్ రిపోర్ట్ అందిన తరువాత మేజిస్ట్రేట్ ముందు ఉంచుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+