గవర్నర్ నిర్ణయంపై భగ్గుమన్న అమరావతి- పలుచోట్ల రైతుల ఆందోళనలు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంపై అమరావతి భగ్గుమంది. గవర్నర్ ప్రకటన రాగానే రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. సీఎం జగన్ తో పాటు గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రాజధాని తరలింపును అడ్డుకుని తీరుతామని నినాదాలు చేస్తున్నారు.
రాజధాని గ్రామాలైన మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంతో పాటు పలుచోట్ల రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాజధాని తరలింపుకు సిద్దమవుతోందని, దానికి గవర్నర్ ఆమోదం తెలపడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా కొన్నిరోజులుగా రోడ్లపై ఆందోళనలు లేకుండా ఇళ్ల వద్దే ఉంటున్న రైతులు... గవర్నర్ తాజా నిర్ణయంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్లపైనే నిరసనలు తెలుపుతున్నారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే విజయవాడలోని గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ వద్ద కూడా భద్రత పెంచారు. రాజ్ భవన్ కు వచ్చే అన్ని దారుల్నీ మూసేశారు.












Click it and Unblock the Notifications