అసెంబ్లీలో దిశ బిల్లు ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్- ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు ఓకే- పోలీసు స్టేషన్లు ఎత్తివేత
ఏపీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో వైసీపీ సర్కారు ఇవాళ మరోసారి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గతంలో బిల్లులో పొందుపరిచిన పలు అంశాల్లో సవరణలు చేస్తూ దిశ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో దిశ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు టీడీపీ డిమాండ్ చేసింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం అందుకు అనుమతించలేదు. టీడీపీ సభ్యులు ఎంతగా పట్టుబట్టినా స్పీకర్ మాత్రం చర్చకు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున దీనిపై తర్వాత చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

Recommended Video
మరోవైపు ఈసారి దిశ చట్టంలో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఇందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కొనసాగించాలని నిర్ణయించారు. కానీ దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లను మాత్రం ఎత్తేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వాస్తవానికి బిల్లు అమల్లోకి రాకుండానే ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించిన పోలీసు స్టేషన్లు, కోర్టులపై అప్పట్లోనే విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నింటికంటే మించి గతంలో బిల్లులో ప్రతిపాదించిన 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నిబందనను కూడా ప్రభుత్వం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు స్టేషన్లు లేక, 21 రోజుల్లో ఉరిశిక్ష లేకుండా ఈ బిల్లు కోరల్లేకుండా తయారవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
-
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications