Vijayawada Seafood Festival : విజయవాడలో సీఫుడ్ ఫెస్టివల్-699కే అన్ లిమిటెడ్ బకెట్.. !

ఏపీలో మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28 నుండి 30 వ తేదీ వరకు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు. స్ధానిక సంస్ధ భూమి ఆర్గానిక్స్ సౌజన్యంతో ప్రభుత్వం ఈ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఫుడ్ ఫెస్టివల్ లో రూ.699/- లతో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీ ఫుడ్ పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2K రన్ ను కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ లో నిర్వహిస్తామన్నారు. విజయవాడతోనే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ అగిపోదని, ఇలాంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాలతో పాటు హైద్రాబాదు, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నామన్నారు.

ap government to hold three day sea food festival in vijayawada-here are details

మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్లో ఆక్వా రైతులు, మత్స్యకారులు, సీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రమోటింగ్ యూనిట్స్ ప్రతినిధులు, సాధారణ పౌరులు మొత్తం దాదాపు 20 వేల మంది సందర్శకుల వరకూ పాల్గొనే అవకాశం ఉందన్నారు. మత్స శాఖ పరంగా పది స్టాళ్లను, నాలెడ్జ్ పార్టర్ అయిన భూమి ఆర్గానిక్స్ వారు కూడా పలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో రాష్ట్రం ఆక్వా హబ్ గా పేరుగాంచినప్పటికీ దేశీయ వినియోగం చాలా తక్కువగా ఉందని మత్సశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మత్స్య సంపదను రాష్ట్రంలో సాలీనా ఒక వ్యక్తి కేవలం 8 కేజీలకు మించి తినడం లేదన్నారు. ఒకప్పుడు రొయ్యలను బ్రెజిల్ పూర్తిస్థాయిలో ఎగుమతి చేసేదని, అయితే దేశీయ మార్కెట్ పెంచుకోవడం వల్ల స్థానికంగానే రొయ్యలను వాడుకునే స్థాయికి బ్రెజిల్ ఎదిగిందన్నారు. అదే స్థాయిలో మన రాష్ట్రం కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ap government to hold three day sea food festival in vijayawada-here are details

దేశ వ్యాప్తంగా 75 శాతం మేర రొయ్యలు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటే, వాటి వినియోగం మాత్రం కేవలం 5 శాతం లోపే ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన రొయ్య అంతా రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్నదని, అంతర్జాతీయ మార్కెట్ పై ఆధార పడి ఆ రొయ్యరేటు ఉంటుందని, అక్కడ ఏమన్నా తేడా వస్తే మన రైతులు నష్టాలకు గురి కావాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇటు వంటి పరిస్థితులను అదిగమించేందుకు దేశీయ మార్కెట్ ను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం జగన్ సూచించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+