విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా పరీక్షల్లో ఏపీనే టాప్, కేసులు తగ్గించడం లేదు: భయపడొద్దంటూ సీఎం జగన్ పిలుపు

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా పోరులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ రాష్ట్రంలోని ప్రతి అధికారి ఎంతో బాగా పని చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా లెక్కలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడా తప్పుచేయలేదన్నారు.

కరోనా సోకిందని ఇళ్లకు రానీయలేదు.. గుట్టల్లోనే తలదాచుకున్న కానిస్టేబుళ్లుకరోనా సోకిందని ఇళ్లకు రానీయలేదు.. గుట్టల్లోనే తలదాచుకున్న కానిస్టేబుళ్లు

కేసులు తగ్గించడం లేదు..

కేసులు తగ్గించడం లేదు..

కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నా.. రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆరువేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రోజుకు 50వేలకుపైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదేనని తెలిపారు.

కరోనా జీవించాల్సిన పరిస్థితి..

కరోనా జీవించాల్సిన పరిస్థితి..

ప్రతి మిలియన్‌కు 31వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. 90 శాతం పరీక్షలు కరోనా క్లస్టర్లలోనే చేస్తున్నామన్నారు. కరోనా విషయంలో అధికారులు, కలెక్టర్లు బాగా పనిచేశారని సీఎం ప్రశంసించారు. కరోనా వస్తుంది.. పోతుంది, దానితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో లక్షకుపైగా కేసులు నమోదైనా.. సగం మందికి నయమైందన్నారు.

85శాతం ఇళ్లల్లోనే కోలుకున్నారు..

85శాతం ఇళ్లల్లోనే కోలుకున్నారు..

దేశంలో కరోనా మరణాల రేటు 2.5 శాతం ఉంటే రాష్ట్రంలో 1.06 శాశాతం ఉందని సీఎం జగన్ తెలిపారు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే కరోనా నయమైందని సీఎం చెప్పారు. కరోనా రాకుండా జాగ్రత్తలు, చికిత్సపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ఉంచాలని, కాల్ సెంటర్ల పనితీరును అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. పరిస్థితి చూసి హోంక్వారంటైన్, జిల్లా, రాష్ట్రస్థాయి కరోనా కేంద్రాలకు పంపిస్తామన్నారు.

ప్రతిరోజూ అడిగితెలుసుకోవాలి..

ప్రతిరోజూ అడిగితెలుసుకోవాలి..


హోంక్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులకు వైద్యులు పర్యవేక్షించాలన్నారు. కరోనా బాధితుడి ఆరోగ్యం గురించి ప్రతి రోజూ అడిగి తెలుసుకోవాసలన్నారు. మనకున్న 80వేల పడకలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా రావడమన్నది పాపం కాదు.. నేరం కాదని అన్నారు. చనిపోయినవారి నుంచి వైరస్ వ్యాపించకుండా చేయాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపారు. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదని చెప్పారు. కరోనాపై ఎవరికీ భయాందోళనలు ఉండకూడదని, కరోనాపై అవకగాహన పెంచుకుని ధైర్యంగా ఎదుర్కోవాలని సీఎంజగన్ పిలుపునిచ్చారు.

Recommended Video

Aishwarya Rai Bachchan Tests Negative For COVID-19, Discharged From Hospital

English summary
ap is top in tests, it not sin tested corona positive: cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X