• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్‌ ఓ బోడిలింగం, షకీలాసాబ్‌- నోరు జాగ్రత్త- కొడాలి నాని హెచ్చరికలు

|

కృష్ణాజిల్లా పర్యటనలో మంత్రి కొడాలినానిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వరుసగా నాలుగోసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నానిపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా గుడివాడలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారంటూ నానిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ ఓ బోడిలింగమని, షకీలా సాబ్‌ అని ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదన్నారు. ప్యాకేజీ స్టార్‌ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. దీంతో మంత్రి కొడాలి కౌంటర్‌ ఇప్పుడు సంచలనం రేపుతోంది.

వైసీపీకి పవన్‌ వార్నింగ్‌- దాడులు చేస్తే భయపడం- ఎదురు తిరుగుతామంటూ...

ఎవరో అడిగితే సమాధానం చెప్పాలా ?

ఎవరో అడిగితే సమాధానం చెప్పాలా ?

గుడివాడ పర్యటనలో పవన్ కళ్యాణ్‌ పేకాట క్లబ్లులపై సమాధానం చెప్పాలని మంత్రి కొడాలి నానిని ప్రశ్నించారు. దీనిపై ఇవాళ స్పందించిన నాని... ఎవరో వచ్చి ఏదో అడిగితే సమాధానం చెప్పమన్నారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు, గెలిపించిన గుడివాడ ప్రజలకు తాను సమాధానం చెప్పాలి కానీ ప్యాకేజీలు తీసుకుని మాట్లాడే యాక్టర్లకు కాదని కొడాలి నాని ఘాటు కౌంటర్లు వేశారు. గుడివాడలో పేకాట క్లబ్బులు మూయించానా, ఆడిస్తున్నానా అనేది వారే చెప్పాలన్నారు. సీఎం జగన్‌ ఏపీలో క్లబ్బులు మూయిస్తున్నారా, ఆడిస్తున్నారా అని నాని ప్రశ్నించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పేకాట క్లబ్లులు నిర్వహించిన చరిత్ర చంద్రబాబు, అతని పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ది అని కొడాలి విమర్శించారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

జగన్‌ శివలింగం, పవన్‌ బోడిలింగం..

జగన్‌ శివలింగం, పవన్‌ బోడిలింగం..

ప్రజల మనోభావాలతో గెలుస్తున్న తనను, పేర్నినాని, ఆళ్ల నానిని బోడిలింగాలనడం సిగ్గుమాలిన చర్య అని కొడాలి విమర్శించారు. శివలింగం ఎవరో, బోడిలింగం ఎవరో ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని నాని తెలిపారు. జగన్‌ శివలింగం కాబట్టే ప్రజలు నెత్తిమీద పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్‌ బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరంలో ప్రజలు కింద పడేసి తొక్కేశారని నాని విరుచుకుపడ్డారు. బోడిలింగం ఎవరో గాజువాక, భీమవరం ప్రజలకు తెలుసని నాని పేర్కొన్నారు.

పవన్‌ సినిమాలు చేసుకోవద్దని ఎవరన్నారు ?

పవన్‌ సినిమాలు చేసుకోవద్దని ఎవరన్నారు ?

పవన్ రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసుకోవడమేంటని వైసీపీ నేతలు గతంలో ప్రశ్నించారు. దీనిపై నిన్న మరోసారి స్పందించిన పవన్ మీరు వ్యాపారాలు మానుకుంటే నేను సినిమాలు మానుకుంటానన్నారు. దీనిపై స్పందించిన కొడాలి నాని.. ఆయన సినిమాలు మానుకోమని ఎవరైనా అడిగారా అని కొడాలి ప్రశ్నించారు. ఆయన సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఒకటేనని కొడాలి వ్యాఖ్యానించారు. పవన్‌ది జనసేన పార్టీ కాదు తెలుగుసేన శాంతి పార్టీ అని కొడాలి అభివర్ణించారు. ప్యాకేజీలు తీసుకుని రోడ్లపైకి వచ్చి మెడ, తొడ రుద్దుకుంటే ప్రజలు నమ్మరని కొడాలి అన్నారు. రైతుల పేరుతో డ్రామాలు ఆడి, నాటకాలు ఆడితే ప్రజలు విశ్వసించరని కొడాలి తెలిపారు. చంద్రబాబు, పవన్, కేఏ పాల్‌ లాంటి పనికిమాలినోళ్లు ఎంతమంది కలిసినా సీఎం జగన్‌ కాలి చిటికెన వేలు గోరు కూడా కదపలేరన్నారు.

షకీలా సాబ్‌.. నోరు అదుపులో పెట్టుకో

షకీలా సాబ్‌.. నోరు అదుపులో పెట్టుకో

ప్యాకేజీలు తీసుకుని మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి కొడాలి హెచ్చరించారు. సొంతపుత్రుడు లోకేష్‌, దత్తపుత్రుడు పవన్‌తో చంద్రబాబు రాజకీయాలు చేస్తే రాలేది బూడిదే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. రాజకీయ పార్టీతో ఇంత వ్యాపారం చేయొచ్చని నిరూపించిన ఆదర్శపురుషుడు పవన్‌ అని కొడాలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వకీల్‌ సాబ్‌ చెప్పాడని సీఎం సాబ్‌కు చెప్పాలన్న పవన్‌పై విరుచుకుపడ్డ నాని.. జనం ఆయన్ను షకీలా సాబ్‌ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పనికిమాలిన సూచనలు యాక్టర్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే స్పెషల్‌ ఫ్లైట్‌ వేసుకుని బోడిలింగం పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లడవచ్చన్నారు.

English summary
andhra pradesh minsiter kodali nani gives strong counter to janasena chief pawan kalyan's recent comments in gudivada. nani said gajuwaka and bhimavaram people shows who is pawan kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X