ఒక దర్యాప్తు .. ఒక రద్దు కోరుతూ ..ఏపీ గవర్నర్ కు లేఖ రాసిన కన్నా లక్ష్మీనారాయణ
బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ గవర్నర్ విశ్వభూషన్‌కు లేఖ రాశారు . ఏపీలో తాజా పరిస్థితులను వివరిస్తూనే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని లేఖలో కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, బెదిరించారని, దాడులకు పాల్పడ్డారని ,అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు కూడా చూసిచూడనట్లు వదిలేశారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు .ఈ విషయంపై ఇప్పటికే ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో వివరించారు.
ఇక చాలా దారుణంగా , ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా జరిపిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరారు కన్నా లక్ష్మీనారాయణ. అంతే కాదు కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు . ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన రాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు . చత్తీస్‌గఢ్ 350 రుపాయలకు కొనుగోలు చేస్తే అవే కిట్లను ఏపీ ప్రభుత్వం మాత్రం 730కి కొనుగోలు చేసిందని తెలిపారు. అవి కూడా నేరుగా కొనుగోళ్లు జరపకుండా థర్డ్ పార్టీ ద్వారా కొనుగోలు చేశారని, దీని వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు.

కిట్ల కొనుగోళ్లపై దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు . ఇక ఇప్పటికే కరోనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో కన్నా వర్సెస్ విజయసాయి పెద్ద యుద్ధమే జరిగింది. వైసీపీ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కిట్ల వ్యవహారంలో కాణిపాకం వినాయకుడి సాక్షిగా వార్ జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా స్థానిక ఎన్నికలు రద్దు చెయ్యాలని, అలాగే కిట్ల కొనుగోలుపై దర్యాప్తు చేయించాలని గవర్నర్ ను కోరిన నేపధ్యంలో గవర్నర్ ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications