దేశంలో ఏ దరిద్రం జరిగినా దాని వెనుక నువ్వు, మీ బాస్ జగన్ ఉంటారు... విజయసాయిపై బుద్దా ఘాటు వ్యాఖ్యలు

గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి . టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్ మరింత పెరిగిపోయింది . టీడీపీని టార్గెట్ చేస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన దళారి సతీష్‌తో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాలపైన కేంద్రం దర్యాప్తునకు ఆదేశించాలంటూ ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ కు అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న .

మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సానా సతీష్ ను అరెస్ట్ చేసిన ఈడీ

మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సానా సతీష్ ను అరెస్ట్ చేసిన ఈడీ

కాకినాడలో విద్యుత్‌శాఖ ఉద్యోగిగా పనిచేసిన సానా సతీష్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా లబ్ధి పొందారు . తనకున్న టెక్నికల్ ట్యాలెంట్‌తో సీబీఐ అధికారులతో పరిచయం పెంచుకుని పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలను సీబీఐ సమన్ల నుంచి తప్పించుకునేలా లంచాల బాగోతం కూడా నడిపినట్లు సతీష్‌పై ఆరోపణలున్నాయి. అంతేకాదు మాంసం ఎగుమతులతో పాటు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడని సతీష్‌పై ఆరోపణల నేపధ్యంలో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు .

సానా సతీష్ వెనుక వుంది చంద్రబాబు అని విజయసాయి ట్వీట్... మనీ ల్యాండరింగ్ కింగ్ వి నువ్వు... మాకేం సంబంధం అన్న బుద్దా

సానా సతీష్ వెనుక వుంది చంద్రబాబు అని విజయసాయి ట్వీట్... మనీ ల్యాండరింగ్ కింగ్ వి నువ్వు... మాకేం సంబంధం అన్న బుద్దా

అయితే సానా సతీష్ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసంటూ ట్వీట్‌ చేసిన విజయసాయికి గట్టి కౌంటర్ ఇచ్చారు బుద్దా.. దేశంలో ఏ దరిద్రం జరిగినా దాని వెనుక నువ్వు, మీ బాస్ జగన్ ఉంటారు అన్నది దేశం మొత్తానికి తెలుసని రివర్స్ పంచ్ ఇచ్చారు . విజయసాయి రెడ్డి గారూ ఎక్కువ లాగకండి .. తెగుద్ది అంటూ మండిపడిన బుద్దా మనీ ల్యాండరింగ్ కింగ్ వి నీవు ... నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని ఘాటుగా ప్రశ్నించారు. దళారి సతీశ్ సానతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయనీ, చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారని విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు బుద్దా అంతే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సమాధానం ఇచ్చారు .

 అన్ని దరిద్రాల వెనుక ఉండేది మీరే .. ముందు మీ ఆత్మను కాపాడుకో అంటూ బుద్దా చురకలు

అన్ని దరిద్రాల వెనుక ఉండేది మీరే .. ముందు మీ ఆత్మను కాపాడుకో అంటూ బుద్దా చురకలు

ఇక అంతే కాదు సాన సతీశ్ లాంటి వ్యక్తితో విజయసాయిరెడ్డికే ఎక్కువ పని ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ దరిద్రం జరిగినా నువ్వు, నీ బాస్(జగన్) ఉంటారనేది దేశ ప్రజలంతా చాలా సార్లు చూశారని ఎద్దేవా చేశారు. ఇక అంతెందుకు అంటూ కీవీపీని కూడా ఈ ట్వీట్ వార్ లోకి లాగారు బుద్దా .. టైటానియం కేసులో అమెరికా అధికారుల ముందు విచారణకు హాజరయ్యేందుకు మీ ఆత్మ(కేవీపీ రామచంద్రారావు) సిద్ధంగా ఉన్నారనీ, ఇక మీ ఆత్మను కాపాడుకునే ప్రయత్నం చెయ్యమని , ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూరి అది ఆపే ప్రయత్నం చేయాలని కాస్త ఘాటుగా చురకలు అంటించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ కు మరి విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+