పవన్ రెండు రోజులు తిరిగి పది రోజులు ఇంట్లో పడుకుంటే నాయకుడవుతారా అన్న మోత్కుపల్లి
పవన్ కళ్యాణ్ పై సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీపై ప్రజలలో విశ్వాసం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ పార్టీపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు గుర్తించటం లేదని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యం జనసేన మీద పడిందన్న మోత్కుపల్లి
ఏపీలో జనసేన ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ ప్రజల్లో నాయకుడిగా గుర్తింపు లేకపోవటమే అని మోత్కుపల్లి పేర్కొన్నారు. సినీరంగంలో హీరోలుగా చేసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి చిరంజీవి ఫెయిల్ అయ్యారని దాని ప్రభావం జనసేన మీద పడటంవల్ల పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యం ఇటీవల ముగిసిన ఎన్నికలలో జనసేన గెలిచే అవకాశాలను ప్రభావితం చేసిందని సీనియర్ రాజకీయవేత్త మోట్కుపల్లి నరసింహులు అభిప్రాయపడ్డారు .

రెండు రోజులు తిరిగి పది రోజులు పడుకుంటే ప్రజల్లో విశ్వాసం కష్టం అన్న మోత్కుపల్లి
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో అనేక అంశాలపై పోరాటం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేవలం పోరాటం సమయంలోనే ఆయన బయటకు వస్తారని రెండు రోజులు తిరిగి పది రోజులు ఇంట్లో పడుకుంటే నాయకులు ఎలా అవుతారని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. అలా కాకుండా నిరంతరాయంగా ప్రజల్లో ఉంటె, నిత్యం ప్రజా క్షేత్రంలో పని చేస్తుంటే అప్పుడు ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఏదైనా నిరసన ప్రణాళిక చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తే ప్రజలు ఎలా గుర్తిస్తారని మోత్కుపల్లి విమర్శించారు.

డబ్బు, మద్యం పంచకుండా ఎవరూ ఉండరని జనసేనాని పై కౌంటర్
ఇక జనసేన మద్యానికి, డబ్బుకు ప్రలోభపెట్టకుండా తాము ఓట్లు సంపాదించామని చెప్పిన పవన్ వ్యాఖ్యలపై మోత్కుపల్లి అందరూ అలాగే చెప్తారు కానీ అందరూ ప్రలోభాలకు గురి చేస్తూనే ఉంటారని ఆ మాటలు అంత పట్టించుకోతగ్గవి కాదని ఆయన తేల్చి పారేశారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పై ఎన్నికల సంఘం నిఘా వున్నా విచ్చలవిడిగా డబ్బు, మద్యం ఓటర్లకు అందుతుంది అని మోత్కుపల్లి తెలిపారు. పవన్ ఇప్పటికైనా ప్రయత్నం చేస్తే నిత్యం ప్రజల్లో ఉంటె వచ్చే ఎన్నికల్లో అయినా కాస్త పుంజుకునే అవకాశం ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications