క్రైస్తవులు ఆవేదనలో ఉన్నారు.. బీసీలు కూడా, సీఎం జగన్‌పై అనిల్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై ఆయన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్‌తో విభేదాల కార‌ణంగా ఆయ‌న‌కు ఉన్న ష‌ర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల‌కు ఓ భ‌ర్త‌గా అనిల్ అన్నీ తానై చూసుకున్నార‌ని.. తెర ముందు ష‌ర్మిల క‌నిపిస్తే.. తెర‌వెనుక మంత్రాంగం మొత్తం అనిలే న‌డిపిస్తున్నార‌న్నారు. ఇటీవ‌లే రాజ‌మ‌హేంద్రవ‌రం వ‌చ్చిన సంద‌ర్భంగా బ్ర‌ద‌ర్ అనిల్‌.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయి స‌రికొత్త రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌కు తెర తీసిన సంగతి తెలిసిందే.

ప్రతినిధులతో భేటీ..

ప్రతినిధులతో భేటీ..

సోమ‌వారం విజ‌య‌వాడ వ‌చ్చిన ఆయ‌న క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు, బీసీ సంఘాల ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో కూడా బ్ర‌ద‌ర్‌ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరిగింది. జ‌గ‌న్‌కు సంబంధించి బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం ప‌నిచేసిన క్రైస్త‌వులు ఇప్పుడు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నార‌ని అనిల్ అన్నారు. ఇటీవ‌లే త‌న‌తో భేటీ అయిన కొంద‌రు క్రైస్త‌వులు ఇదే మాట‌ను త‌న‌తో చెప్పార‌ని తెలిపారు. ఏపీ వేదిక‌గా తాము కొత్త పార్టీ పెడుతున్నామ‌న్న‌ది పూర్తిగా స‌త్య‌దూరమ‌ని.. అదంతా అస‌త్య ప్ర‌చార‌మేన‌ని తెలిపారు. ఉండ‌వ‌ల్లిని క‌లిసిన అంశం వేరేద‌ని, అయినా ఏదైనా ఉంటే తానే స్వ‌యంగా వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని అనిల్ చెప్పుకొచ్చారు.

క్రిస్టియన్స్, బీసీ సంఘాలు

క్రిస్టియన్స్, బీసీ సంఘాలు


విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీసీ మైనారిటీ క్రిష్టియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన బ్రదర్ అనిల్‌తో చర్చించి మా సమస్యలను వినిపించామని అన్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం.. అప్పట్లో బ్రదర్ అనిల్ తమతో సమావేశాల్లో పాల్గొని చెప్పడం వల్లే వైసీపీకి ఓటు వేసి గెలిపించామని బీసీ నేతలు అంటున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని బ్రదర్ అనిల్‌కు తెలియజేశామని వివరించారు.

Recommended Video

    Special Interview With Church Father On The Eve Of Christmas | Oneindia Telugu
    మరీ ఏపీలో

    మరీ ఏపీలో


    తెలంగాణలో పార్టీ కొనసాగుతోంది. మరీ ఏపీలో ఏం జరుగుతుందనే సందేహాం ఉంది. కానీ పార్టీ ఏర్పాటు.. లేదంటే విస్తరణ గురించి మాత్రం బ్రదర్ అనిల్ కుమార్ నోరు విప్పలేదు. తమకు ప్రత్యామ్నాయ వేదిక కావాలని అడుగుతుండగా.. అదేం లేదులే అని సర్ది చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+