హాయ్ ల్యాండ్ ఎండీకి అగ్రిగోల్డ్ ఉచ్చు.. అర్ధరాత్రి సీఐడీ అటాక్
విజయవాడ : హాయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హాయ్ ల్యాండ్ తో పాటు అగ్రిగోల్డ్ ప్రాపర్టీ వేలం ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారనేది అభియోగం. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కుట్ర పన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో అగ్రిగోల్డ్ కేసులో అల్లూరి వెంకటేశ్వరరావును నిందితుడిగా చేర్చారు. గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
అల్లూరి వెంకటేశ్వరరావు హాయ్ ల్యాండ్ ( ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ) తో పాటు ఇతర పద్దెనిమిది కంపెనీల్లో డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ లాంటి హోదాల్లో ఉన్నారు. అయితే ఈ కంపెనీలన్నీ కూడా అగ్రిగోల్డ్ గ్రూపులో అంతర్భాగమేనని తెలుస్తోంది. వీటిని డొల్ల కంపెనీలుగా కూడా గుర్తించారు అధికారులు. పధ్నాలుగు కంపెనీలకు సంబంధించి అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితులైన అవ్వా వెంకటశేషు నారాయణరావు, అవ్వా సీతారామావు, అవ్వా హేమసుందర వరప్రసాద్, కామిరెడ్డి శ్రీరామచంద్రరావు, సవడం శ్రీనివాస్ తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు.

ఆకర్షణనీయమైన స్కీములతో అగ్రిగోల్డ్ సంస్థ ప్రజలను మోసం చేసింది. వివిధ రూపాల్లో కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. అయితే ఈ సొమ్మునంతా దాదాపు 156 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు గతంలోనే సీఐడీ గుర్తించింది. ఇప్పటికే 26 మందిని నిందితులుగా చేర్చిన సీఐడీ.. తాజాగా అల్లూరి వెంకటేశ్వరరావు అరెస్ట్ చేయడంతో వారి సంఖ్య 27కు చేరింది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications