విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

atchannaidu: సీఎం జగన్‌పై నిప్పులు, ఈసీపై సీఎస్, స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు..

|
Google Oneindia TeluguNews

కులం పేరుతో రాజకీయాలు చేయడం ఏంటీ అని మాజీమంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారం కూడా కులం పేరు ప్రస్తావించి రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌పై నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఏపీలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. పాలన పడకేసింది, అభివృద్ది జరగడం లేదని గుర్తుచేశారు. కానీ వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తే.. ఎన్నికల కమిషనర్‌పై మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ పదవీలో ఉండి తమ్మినేని సీతారం నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కులాల అంశానికి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారో చర్చకు వైసీపీ సిద్ధమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

cs, speaker comments are not fair in ec: atchannaidu

Recommended Video

MP Political Crisis: Speaker adjourns House without floor test | బలపరీక్ష ను అడ్డుకున్న కరోనా వైరస్

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు అంటే ఓకే అని.. నాలుగు వారాలపాటు రాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలా చెబుతారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదలకు సంబంధం లేదని ఈసీ రమేశ్ కుమార్ స్పష్టంచేశారని గుర్తుచేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదని.. ఈసీని దూషిస్తున్నారని గుర్తుచేశారు. ఇకనైనా సీఎం జగన్, వైసీపీ నేతలు తమ తీరు మార్చకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. లేదంటే ప్రజలు ముందు మోకారిళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.

English summary
ap csNeelam Sahni, speaker tammineni sitharam comments are not fair in ec ramesh kumar ex minister atchannaidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X