గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా .. టచ్ చేసి చూడు .. కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పై, మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొడాలి నాని దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఇంటికెళ్లి మరీ బడిత పూజ చేస్తామని వ్యాఖ్యానించడం, వదినని చంపి ఎమ్మెల్యే అయ్యావంటూ విమర్శించడంతో ఏపీలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరుకుంది .

Recommended Video

    సీఎం జ‌గ‌న్‌కు దేవినేని ఉమా ఛాలెంజ్..!

    గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపడుతున్నానన్న దేవినేని ఉమా

    గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపడుతున్నానన్న దేవినేని ఉమా

    కొడాలి నాని వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన దేవినేని ఉమా జనవరి 18వ తేదీన మంగళవారం , నేడు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు దీక్షకు దిగుతున్నట్లు గా ప్రకటించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపడుతున్నానని, దమ్ముంటే టచ్ చేసి చూడమని దేవినేని ఉమా సవాల్ విసరడంతో గొల్లపూడి లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది .

    సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తారో, కొడాలి నాని వస్తారో రండి, టచ్ చేసి చూడండి

    సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తారో, కొడాలి నాని వస్తారో రండి, టచ్ చేసి చూడండి


    దేవినేని ఉమ సవాల్ తో అప్రమత్తమైన పోలీసులు దేవినేని ఉమా నివాసంతో పాటు గొల్లపూడి లో భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

    దేవినేని ఉమా ఇంటికెళ్లి మరీ బడిత పూజ చేస్తామని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తారో, కొడాలి నాని వస్తారో రండి, గొల్లపూడి లో దీక్షకు కూర్చుంటా.. టచ్ చేసి చూడండి అంటూ దేవినేని ఉమా సవాల్ విసిరారు. సొంత బాబాయ్ ని ఎవరు హత్య చేశారో జగన్ ని నిలదీసే ధైర్యం మంత్రికి ఉందా అంటూ ప్రశ్నించారు.

    బూట్లు నాకే ఉద్యోగం చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి

    బూట్లు నాకే ఉద్యోగం చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి

    అంతేకాదు ఉడుత ఊపులకు భయపడే జగన్ అమిత్ షా కాళ్లు పట్టుకోవడం కోసం అంటూ దేవినేని వ్యాఖ్యానించారు. బూట్లు నాకే ఉద్యోగం చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దేవినేని ఉమా. నిన్న కొడాలి నానీ చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని ఉమా అన్న వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేశారు మరోపక్క కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సైతం భగ్గుమంటున్నారు.

     దేవినేనిపై కొడాలి నానీ వ్యాఖ్యలపై కేసు పెట్టాలన్న వర్ల రామయ్య

    దేవినేనిపై కొడాలి నానీ వ్యాఖ్యలపై కేసు పెట్టాలన్న వర్ల రామయ్య

    దేవినేని పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఇంటికొచ్చి మరీ దాడి చేస్తాననడం నేరపూరితమైన ఆయనపై వెంటనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడి చేసిన పాస్టర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. కొడాలి నాని తీరు మార్చుకోకుంటే ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+