Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాగి బడికొచ్చిన తొమ్మిదో తరగతి బాలికలు.. ఏం చేశారో తెలుసా

విద్యాబుద్ధులు నేర్వాల్సిన వయసులో వ్యసనాలను నేర్చుకున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయస్సులో తప్పతాగి బుద్ధి లేని పని చేశారు. తొమ్మిదో తరగతి లోనే తూలిపోయారు. ఇదంతా చేసింది అబ్బాయిలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. స్కూల్లో మందుకొట్టి చాలా అసభ్యంగా ప్రవర్తించింది బాలికలు అంటే అవాక్కయ్యారా ..

తొమ్మిదో తరగతిలోనే తాగి .. నోటికొచ్చింది వాగిన విద్యార్థినులు

తొమ్మిదో తరగతిలోనే తాగి .. నోటికొచ్చింది వాగిన విద్యార్థినులు

తెలిసి తెలియని వయసులోవ్యసనానికి బానిసలయ్యారు ఇద్దరు బాలికలు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలికలు బుద్ధిగా బడికెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకోవడం మానేసి ఏకంగా తాగుడుకు అలవాటు పడ్డారు. చక్కగా చదువుకోవాల్సిన ఆ విద్యార్థినులు మద్యం తాగి తూలుతూ తరగతికి వచ్చారు. శనివారం రోజు ఉదయం స్కూల్ బ్రేక్ లో మద్యం బాటిల్ తెచ్చుకుని తాగారు. అక్కడితో ఊరుకోకుంబడా పక్కనే ఉన్న తోటి స్టూడెంట్స్ పై ఇష్టమొచ్చినట్లుగా చెలరేగిపోయిన ఆ బాలికలు అసభ్యపదజాలంతో నోటికొచ్చినట్టు మాట్లాడారు.

షాక్ అయిన టీచర్లు .. టీసీ ఇచ్చి స్కూల్ నుండి గెంటివేత

షాక్ అయిన టీచర్లు .. టీసీ ఇచ్చి స్కూల్ నుండి గెంటివేత

వారి ప్రవర్తనను గమనించిన విద్యార్థులు విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆ బాలికలకు టీసీ ఇచ్చి పంపించేశారు. విజయవాడ నగర శివారులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు శనివారం మద్యం తాగి తరగతులకు హాజరయ్యారు. పక్కన కూర్చున్న విద్యార్థినులకు వాసన రావడంతో వారు ఈ విషయాన్ని ఉపాధ్యాయుడికి చెప్పారు. ఆ ఇద్దరినీ పిలిచి చూడగా..మద్యం వాసన గుప్పున వచ్చింది. వెంటనే ప్రధానోపాధ్యాయుడు బి.సురే్‌షకుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వచ్చాక పుస్తకాల బ్యాగ్‌లు తనిఖీ చేస్తే.. అందులో కోక్‌ బాటిల్‌లో మందు ఉంది.దీంతో హెచ్‌ఎం ఆ ఇద్దరికీ టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. స్కూల్ పరువు పోతుందని టీసీ ఇచ్చి గెంటివేశారు.

సమాజాన్ని షాక్ కు గురిచేస్తున్న సంఘటన

సమాజాన్ని షాక్ కు గురిచేస్తున్న సంఘటన

అందరూ అవాక్కయ్యేలా పాఠశాలలో బాలికలు తప్ప తాగి నానాయాగీ చేయడం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది.గతంలో గుణదలలోని మిషనరీ స్కూల్‌లోనూ ఈ ఇద్దరు బాలికలు ఇలాగే ప్రవర్తించడంతో అక్కడా టీసీ ఇచ్చి పంపించేశారని సమాచారం.పాఠశాల నుంచి తీసి ఇచ్చి పంపించి నప్పటికీ చిన్న వయసులో ఈ తరహా వ్యసనాలకు అలవాటై, తప్పు దారిలో నడుస్తున్న బాలికలను మార్చాల్సిన అవసరం అటు తల్లిదండ్రులపైన, ఇటు గురువుల పైన ఉంది. కారణాలేవైనా అమ్మాయిలు ఈ తరహా వ్యసనాలకు అలవాటు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+