• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను రెడీ.. కన్నా,సుజనా ప్రమాణం చేస్తారా !! పురంధరేశ్వరిని రచ్చలోకి లాగిన విజయసాయి

|
Google Oneindia TeluguNews

కరోనా నేపథ్యంలో ర్యాపిడ్ కిట్ల కొనుగోలు విషయంలో ఏపీలో రసవత్తర రాజకీయం కొనసాగుతుంది. సహజంగా టీడీపీ వర్సెస్ వైసీపీ రచ్చ కొనసాగుతుంది కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీ రగడ కొనసాగుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది .

కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!

విజయసాయికి దమ్ముంటే ప్రమాణం చెయ్యమన్న కన్నా .. ప్రతి సవాల్ చేసిన విజయసాయి

విజయసాయికి దమ్ముంటే ప్రమాణం చెయ్యమన్న కన్నా .. ప్రతి సవాల్ చేసిన విజయసాయి


నిన్నటికి నిన్న రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరీలు తమపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక దశలో కన్నా విజయసాయికి సవాల్ విసిరారు. నన్ను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికీ లేదు. నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా? విజయసాయిరెడ్డి అధికారమదం తలకెక్కి మాట్లాడుతున్నారు అని కన్నా చేసిన సవాల్ కు ప్రతి సవాల్ చేశారు విజయసాయి రెడ్డి . అంతటితో ఆగక పురంధరేశ్వరిని కూడా ఈ రగడ లోకి లాగారు .

 కాణిపాకం లేదంటే తిరుమలలో ప్రమాణానికి సిద్ధం

కాణిపాకం లేదంటే తిరుమలలో ప్రమాణానికి సిద్ధం


తాజాగా కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యలపై మండిపడిన విజయసాయి రెడ్డి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. కాణిపాకం లేదంటే తిరుమలలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు .ఇక తాము ఎలాంటి అవినీతి చేయలేదని కన్నా, సుజనా ప్రమాణం చేయగలరా? అంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. సుజనా చౌదరిని ఉద్దేశించి షెల్ కంపెనీలతో బ్యాంకులకు సుజనా రుణాలు ఎగ్గొట్టారని మండిపడ్డారు . గతంలో నేను సుజనా కోసం పనిచేశాను. గత ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం ఎంత ఇచ్చింది. కన్నా, పురంధరేశ్వరి ఎంతెంత తీసుకున్నది నాకు తెలుసు అంటూ విజయసాయి మరోమారు నిప్పులు చెరిగారు .

 పురంధరేశ్వరిని టార్గెట్ చేసి విజయ సాయి వ్యాఖ్యలు

పురంధరేశ్వరిని టార్గెట్ చేసి విజయ సాయి వ్యాఖ్యలు


మళ్లీ చెబుతున్నా కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పారు విజయసాయి రెడ్డి . ఇక అంతే కాదు ప్రజలను దోచుకోవాల్సిన కర్మ మాకు లేదు అంటూ విజయసాయి చెప్పుకొచ్చారు . రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదని పేర్కొన్నారు. ఏపీ రాజధాని విశాఖనేనని , విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుందని , అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరే కాకుండా కొత్తగా పురంధరేశ్వరిని టార్గెట్ చేసి విజయ సాయి వ్యాఖ్యలు చెయ్యటం ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తుంది .

Recommended Video

Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar
 ఏపీలో కరోనా కిట్ల విషయంలో బీజేపీ , వైసీపీ మాటల యుద్ధం

ఏపీలో కరోనా కిట్ల విషయంలో బీజేపీ , వైసీపీ మాటల యుద్ధం


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఒక వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు తీసుకున్నారని దానికి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బ్రోకర్ గా వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలతో మొదలైన రగడ మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా అంటూ ఘాటుగా విమర్శలు చెయ్యటంతో మరింత పెరిగింది . ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కన్నా , సుజనా చౌదరి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఒకమారు విజయసాయి తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు.

English summary
Vijayasai Reddy responded to bjp chief kanna lakshmi narayana challenge and he said that he is ready to do a promise in any temple . he alleged that is how much the BJP gave in the last election. Vijayasai once again ignited the fire as I knew how much kanna lakshmi narayana and Purandeshwari had taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X