నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో కీలక నిర్ణయం
Recommended Video
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులలో నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను స్థాపించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నిరుద్యోగుల పాలిట వరంగా మారనుంది.

స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి వేదికగా ఇవాళ జరిగిన స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలోనినిరుద్యోగులలో స్కిల్స్ మరింత పెంచాలని అందుకోసం ప్రభుత్వం వైపు నుండి కూడా కృషి ఉండాలని భావించారు. సీఎం జగన్ అమరావతిలోని సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్ష జరిపారు.

శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఈ సమీక్షలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడానికి వారిలో సరైన స్కిల్స్ లేకపోవడం ఒక కారణంగా గుర్తించారు. అందుకే ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభిన్న రంగాల్లో నిరుద్యోగులు రాణించేందుకు కావలసిన చదువులు, శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు .

నైపుణ్యాభివృద్ధికి యూనివర్సిటీ ఏర్పాటు ..25 కాలేజీలు
రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధికోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండాయూనివర్శిటీ కింద ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీని స్థాపించాలని జగన్ సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ పరిధిలో 25 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు స్థాపించాలని జగన్ సూచించారు. దీంతో ఏపీలో నిరుద్యోగులు, విద్యార్థులు చక్కటి స్కిల్స్ తో శిక్షణ పొంది ఉద్యోగావకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది.

పాఠ్యప్రణాళికలో మార్పులు చెయ్యాలని సూచన
ఇక అంతే కాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నిరుద్యోగులకు శిక్షణ ద్వారా అందించాలని, నైపుణ్యాభివృద్ధికోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ సూచించారు. ఇక ఈ బాధ్యతలను యూనివర్సిటీలో నిర్వర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ శాఖల్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి శిక్షణ కార్యక్రమాల పైన విడివిడిగా నిధులను వినియోగించాల్సిన అవసరం లేదన్నారు.

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లపై దృష్టి
ఆర్థిక శాఖకు నిధుల వినియోగ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత లో స్కిల్ డెవలప్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు.చదువు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి లభించాలని అదే తమ ప్రభుత్వ అభిమతమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక నామమాత్రంగా ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిల రూపురేఖలు మార్చాలని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్ జరగాలని ఆయన తెలిపారు.

నెలరోజుల్లోగా కార్యాచరణకు ఆదేశం
గ్రామ సచివాలయాల వారీగా స్థానికంగా వారి సేవలను పొందటానికి ఒక యాప్‌ను రూపొందించాలని,దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తాను చేసిన సూచనలను, ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని నెలరోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలని,అప్రెంటిస్ అయ్యాక కూడా ఇంకా శిక్షణ అవసరమనుకుంటే మళ్లీ నేర్పించాలని, ఆతర్వాతే పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications