విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ తో పవన్ కల్యాణ్ భేటీ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం విజయవాడ బందరు రోడ్డులో గల రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూరకంగా కలిశారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ వెంట పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు ఉన్నారు. విశ్వభూషణ్ హరిచందన్ కొత్తగా రాష్ట్రానికిక గవర్నర్ గా వచ్చినందున.. మర్యాదపూరకంగా మాత్రమే కలిసినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. సుమారు 25 నిమిషాల పాటు వారి మధ్య భేటీ కొనసాగింది. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు చోటు చేసుకోలేదని అన్నారు.

కేఫ్ కాఫీ డే అధినేత మిస్సింగ్ పై మత్స్యకారుల కీలక సమాచారంకేఫ్ కాఫీ డే అధినేత మిస్సింగ్ పై మత్స్యకారుల కీలక సమాచారం

పవన్ తో భేటీ కానున్న వంగవీటి రాధ

Jana Sena Party Chief Pawan Kalyan met Governor of Andhra Pradesh at Vijayawada

ప్రస్తుతం విజయవాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధా కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో- ఆయన మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని అంటున్నారు. జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని అంటున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు కొనసాగిన వంగవీటి రాధా.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
Jana Sena Party Chief Pawan Kalyan was met Governor of Andhra Pradesh Viswa Bhushan Harichandan at Raj Bhavan in Vijayawada on Tuesday. Pawan Kalyan went this morning to Raj Bhavan along with his Party leaders Nadendla Manohar, Nagababu etc..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X