కుప్పంలో బాబు, మంగళగిరిలో మాలోకం.. ఇద్దరు గెలవరు, బాబే వైన్ షాపులు అంటూ
చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కాంలో భారతీ పాత్ర గురించి బాబు చేసిన కామెంట్ల గురించి రియాక్ట్ అయ్యారు. వైన్ షాప్‌ల గురించి ఢిల్లీ వెళ్లి అడుక్కునే అవసరం లేదన్నారు. అదే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వెళ్లి తీసుకుంటారని చెప్పారు.

బాబుకే అవసరం..
రాష్ట్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. అయినా ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత? అని పేర్కొన్నారు. వైఎస్ భారతి ఢిల్లీ వెళ్లి వైన్ షాపులకు లైసెన్స్‌లు అడుక్కునే ఖర్మ ఉందా? అని ప్రశ్నించారు. వైన్ షాపులు ఇవ్వండని అడుక్కునే ఖర్మ చంద్రబాబుది అని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలవరని స్పష్టంచేశారు. మంగళగిరిలో లోకేశ్‌ది సేమ్ సిచుయేషన్ అన్నారు.

3 క్యాపిటల్స్
ఇటు ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు గురించి మాట్లాడారు. పరిపాలన రాజధానిని వైజాగ్ తీసుకెళ్లడం తథ్యం అని కీలక ప్రకటన చేశారు. పరిపాలన రాజధాని విశాఖతోపాటు న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి జరిగి తీరుతాయని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆ రెండు నగరాలు డెవలప్ అవుతాయని చెప్పారు.

డెవలప్
విశాఖ పరిపాలన రాజధాని అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. వైజాగ్‌లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో కేవలం రూ.10 వేల కోట్లు పెడితే సంపద సృష్టించవచ్చని తెలిపారు. అమరావతిని మహా నగరాలతో పోల్చి చంద్రబాబు ప్రజలకు ప్రజలకు ఆశలు కల్పిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications