చంద్రబాబు నాయుడు పిట్టల దొర.. పగటి వేషగాడు: మంత్రి కొడాలి నానీ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పిట్టలదొర అని, పగటి వేషగాడు అని చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు నమ్మి మోసపోవద్దని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు కావాలని రగడ చేస్తున్నారని నాని తిట్టిపోశారు.

పగటి వేషగాడిలా సొల్లు మాటలు చెప్పారని బాబుపై నానీ ఫైర్
రాష్ట్రానికి రాజధాని నిర్మించే విషయంలో దొంగలాగా బాబు ప్రవర్తించారని పేర్కొన్నారు మంత్రి కొడాలి నాని. రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కునేందుకు చంద్రబాబు టిడిపి హయాంలో పగటి వేషగాడిలా సొల్లు మాటలను చెబుతూ వచ్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని విమర్శించారు. డోకిపర్రులోని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కనుమూరి రామిరెడ్డి నివాసంలో మాట్లాడిన నాని పొరబాటున కూడా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని రాజధాని రైతులకు సూచించారు.

33 వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకే బాబు మాయమాటలు
33 వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకు మాయ మాటలు చెప్పారని చంద్రబాబుపై నాని నిప్పులు చెరిగారు. ఇక జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కమిటీ నివేదికలను నిన్ను వేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పరిపాలన నచ్చకనే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పారని, ఆయన చంద్రబాబు తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శించారు.

వైజాగ్‌ను ముంబాయిలా త్వరలో చూడనున్నామన్న నానీ
రాజధాని రైతులకు పిట్టలదొరలా దొంగమాటలు చెప్పొద్దని చంద్రబాబును ఉద్దేశించి నాని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనా విధానం సాగుతుందని నాని కొనియాడారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అన్ని రకాల మౌలిక వసతులు ఉన్న షిప్ యార్డ్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్న వైజాగ్‌ను ముంబాయిలా త్వరలో చూడనున్నామని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు గ్యాంగ్ మాటలు నమ్మి మోసపోవద్దు అన్న మంత్రి
రాయలసీమలో కోర్టులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. ఏపీ ప్రజలు చంద్రబాబును, చంద్రబాబు గ్యాంగ్ చెబుతున్న మాటలు నమ్మకూడదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్టు గ్రాఫిక్ నిర్మాణాలు రాజధానిలో సాధ్యం కావన్నారు. జగన్ ఏం చేసినా తెలుగు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకే అని నానీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications