కేశినేని నాని ఇంటెన్షన్ క్లియర్..!!

విజయవాడ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- రాష్ట్రంలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు దీనికి సన్నద్ధమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు ఎవరి పంథాలో వాళ్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు.

ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పార్టీ లోక్‌సభ సభ్యులు పాల్గొనకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా టీడీపీకి గుండెకాయగా చెప్పుకొనే అమరావతి ప్రాంతంలో జరిగిన ఈ పాదయాత్రలో సిట్టింగ్ ఎంపీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.

Galla Jaidev

ఆ ఇద్దరూ- గుంటూరు, విజయవాడ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని. తన సొంత నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వయంగా పాదయాత్ర చేస్తోంటే వారిద్దరూ పత్తా లేకుండా పోయారు. జిల్లా స్థాయి లేదా కనీసం తమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనైనా ఆయన పాదయాత్రను దగ్గరుండి చూసుకోవాల్సిన ఎంపీలే ముఖం చాటేశారు.

ఇది కాస్తా తెలుగుదేశం పార్టీలో దుమారం రేపింది. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కనీసం కన్నెత్తి చూడకపోవడం.. ద్వితీయ శ్రేణి నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలను గందరగోళంలో పడేసింది. గల్లా జయదేవ్, కేశినేని నాని అనుచరులు సైతం నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

దీనివల్లే- గన్నవరంలో నారా లోకేష్ నిర్వహించిన బహిరంగ సభకు పొరుగు జిల్లాలు, ఇతర నియోజకవర్గాల నుంచి అదే పనిగా బస్సులు పెట్టి మరీ జనాన్ని సమీకరించాల్సి వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గల్లా జయదేవ్, కేశినేని నాని.. దాదాపుగా పార్టీకి దూరం అయినట్టేనని, తమ దారి తాము చూసుకుంటోన్నారనేది స్పష్టమైందనే అంటున్నారు.

ఈ పరిణామాల మధ్య- తాజాగా తన ఉద్దేశం ఏమిటనేది కేశినేని నాని మరోసారి స్పష్టం చేశారు. నేడు ఆయన కొండపల్లి బొమ్మల తయారీ, విక్రయ భవన సముదాయాన్ని ప్రారంభించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తి పథకం- ఎంపీలాడ్స్ నిధులతో దీన్ని నిర్మించారు నాని. ఈ ఉదయం 9 గంటలకు ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.

Kesineni Nani

దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రంలో టీడీపీ అనే పదం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు కేశినేని నాని. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఫొటో లేదా కేంద్ర ప్రభుత్వ పథకం, ఎంపీలాడ్స్ నిధులు కావడం వల్ల ప్రధానమంత్రి ఫొటోను ప్రచురిస్తుంటారు. అవేవీ లేవు ఈ ఆహ్వానపత్రంలో.

దీన్ని బట్టి చూస్తోంటే- నాని మరోసారి తన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేసినట్టయింది. గతంలో తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లల్లో నాని ఫొటోను మిస్ చేశారు టీడీపీ నాయకులు. నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఫొటోను ముద్రించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చిన్నికి విజయవాడ లోక్‌సభ టికెట్‌ ఖాయం కావడం వల్లే నాని టీడీపీకి గుడ్‌బై చెప్పబోతోన్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+