విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ మారబోతున్నారా..? క్లారిటీ ఇచ్చేసిన గంటా శ్రీనివాసరావు..

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి,భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడుగులు ఎటువైపు..? గత కొంతకాలంగా ఆయన రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. ఒకానొక సమయంలో ఆయన బీజేపీలో చేరిపోవడం ఖాయమైందంటూ కథనాలు కూడా వచ్చాయి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ గంటా మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటును గంటా స్వాగతించడం.. గంటా పార్టీ మారుతారా అన్న చర్చను మరోసారి తెర పైకి తీసుకొచ్చింది.

పార్టీ మార్పు ఊహాగానాలపై తాజాగా స్పందించిన గంటా.. అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అమరావతి రైతులకు సంఘీభావంగా కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలన్న అధినేత పిలుపుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే అమరావతి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో రాజధాని ఏర్పాటుతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్న ఆందోళనలను ప్రభుత్వం తొలగించాలన్నారు. ఇటీవలి కాలంలో తానేం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని, సంబంధం లేని విషయాలను తెర పైకి తీసుకువస్తున్నారని గంటా వాపోయారు.

no thought to join with another political party says ganta srinivas dismisses speculations

ఇదిలా ఉంటే, విశాఖలో రాజధాని ఏర్పాటును గంటా సహా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతించిన సంగతి తెలిసిందే. దీనిపై వారు ఏకంగా తీర్మానం కూడా చేశారు. రాజధానిపై
సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపించడం టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బందిపెట్టేదిగా మారింది. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర,రాయలసీమ అభివృద్ది జరగడం ఇష్టం లేదని
వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి అయితేనే అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందని,రాజధాని ఏర్పాటు అక్కడ అయితేనే సబబుగా
ఉంటుందని చెబుతోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను హైపవర్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది.
దీంతో ప్రభుత్వం ఇదివరకే చెప్పినట్టు విశాఖ వైపే మొగ్గుచూపుతుందా.. లేక రైతుల ఆందోళనలకు తలొగ్గి నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది.

English summary
Bhimili MLA Ganta Srinivas dismissed speculations about quitting TDP. He does't have thought to quit party,Ganta Said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X