విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో లక్ష ఇళ్లు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళుతున్నట్లు పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఆ క్రమంలో పేదవారి సొంతింటి కల సాకారం చేసేలా బెజవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు రెడీ అయింది ఏపీ ప్రభుత్వం.

బెజవాడలో లక్ష ఇళ్లు నిర్మించడానికి వెయ్యి కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ క్రమంలో నగర శివార్లలో స్థలం సేకరించాలని డిసైడయ్యారు. ఎకరానికి వంద ఇళ్ల నిర్మాణం చొప్పున మొత్తం వెయ్యి ఎకరాల్లో లక్ష ఇళ్లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. జీ ప్లస్ త్రీ కేటగిరీ కింద ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు.

one lakh houses construction in vijayawada ap govt decision

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!

ఐదేళ్లలో లక్ష ఇళ్లు నిర్మించి పేదవారి సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఐదేళ్లలో ఈ ప్రణాళిక పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇల్లు లేని పేదలకు కేటాయించాలనేది ప్రభుత్వం అంతరంగంగా గోచరిస్తోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల నిర్మాణం గురించి ప్రస్తావించింది వైసీపీ. ఒకవేళ తమకు అధికారం కట్టబెడితే.. రానున్న ఐదేళ్లల్లో 25 లక్షల గృహాలు నిర్మించడమే లక్ష్యంగా ముందుకెళతామని స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే తొలుత బెజవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల మేనిఫెస్టో హామీల ప్రకారం 25 లక్షల గృహ నిర్మాణం పూర్తయితే ఇళ్లు లేని పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
AP government is ready to build One Lakh houses in Vijayawada to fulfill the dream of the poor. Proposals have been prepared with an estimate of Rs thousand crores. To that end, the city suburbs were decommissioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X