జగన్ కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే కౌంటర్- అదీ శాస్త్రీయంగా... ఏమన్నాడో తెలుసా ?

కరోనా వైరస్ ఎవరికైనా వస్తుంది, పోతుంది.. ఇదేమీ భయంకరమైన రోగం కాదు అని తాజాగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. జగన్ కామెంట్స్ పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం అనుకున్నట్లు కోవిడ్ 19 సాధారణ జ్వరం కాదని, రోగుల ఊపిరితిత్తులకు తీవ్ర స్ధాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయని పవన్ తెలిపారు. కావాలంటే సైన్స్ న్యూస్ వెబ్ సైట్లో వచ్చిన ఈ కథనం చదువుకోండి అంటూ ఓ లింక్ ను కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పవన్ పోస్ట్ చేశారు.

pawan kalyans counter to jagans comments over coronavirus

గతంలోనూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సీఎం జగన్ కు అనేక కౌంటర్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైరస్ ను పట్టుకుని సాధారణ జ్వరం అంటారా అనేలా జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ ఈ ట్వీట్ చేశారు. దీనికి మద్దతుగా సైన్స్ న్యూస్ లో వచ్చిన ఓ కథనం లింక్ ను కూడా పోస్ట్ చేయడంతో తన వాదన శాస్త్రీయమైనదే అని నిరూపించుకునేందుకు పవన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+