సీరియస్ టైమ్ లో సెల్ఫీలు... రోజా తీరుపై అసహనం .. క్లాస్ పీకిన సీఎం జగన్ !!
ఏపీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బిల్లు శాసన సభలో ఆమోదం పొందినా మండలి మాత్రం ఫెయిల్ అయ్యింది. మండలిలో తెలుగుదేశం పార్టీ ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంది. తెలుగుదేశం పార్టీ కొంత కాలం పాటు అడ్డుకుని మూడు రాజధానుల ఏర్పాటును ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసింది.

శాసనమండలి లాబీల్లో బాలకృష్ణతో సెల్ఫీలు దిగిన రోజా తీరుపై చర్చ
ఇక ఇలాంటి సీరియస్ వాతావరణంలో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనమండలి లాబీల్లో వ్యవహరించిన తీరుపై పార్టీ వర్గాల్లోనూ, వైసీపీ అభిమానుల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మండలి లాబీలో రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి సెల్ఫీలు తీసుకోవటం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా లాబీ నుంచి మండలిని డిక్టేట్ చేశాడని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

సీరియస్ టైం లో సిల్లీగా సెల్ఫీలు తీసుకున్న రోజాపై వైసీపీ నేతల అసహనం
అలాంటి సమయంలో అక్కడే ఉండి అసలే సీరియస్ నెస్ లేకుండా సిల్లీగా సెల్ఫీలు తీసుకోవటం వైసీపీ నేతలకు నచ్చటం లేదు .మండలి లాబీలో చంద్రబాబు పక్కనే ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్ఫీలు దిగారు. రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం తప్పేం కాదు కానీ సందర్భానికి తగినట్టు రోజా ప్రవర్తించలేదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

సెల్ఫీల వ్యవహారం పై క్లాస్ పీకిన సీఎం జగన్
చాలా ఘాటుగా విమర్శలు చేసుకుంటూ, మరో వైపు చాలా హాట్ హాట్ గా ఉన్న టాపిక్ మీద చర్చ జరుగుతున్న సమయంలో , అలాంటి రాజకీయ వాతావరణంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా చేడయం మాత్రం విమర్శలకు తావిస్తూ ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ తో రోజా నవ్వుతూ సెల్పీలు దిగటమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది రోజా . ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సెల్ఫీల వ్యవహారం పై క్లాస్ పీకినట్టు తెలుస్తుంది .

వివాదాస్పదం అయిన రోజా బాలయ్యతో సెల్ఫీ వ్యవహారం
సీరియస్ సమయంలో ఇలాంటి కామెడీలు చేస్తూ బాలకృష్ణతో సెల్ఫీలు దిగిన రోజాపై సీఎం సీరియస్ అయ్యారని సమాచారం . ఇక వైసీపీ అభిమాన వర్గాలు ఇప్పుడు తెలుగుదేశం మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో రోజా వారితో నవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగడం వారిని మరింత అసహనానికి గురి చేస్తూ ఉంది. రోజాకు ఎప్పుడు ఎలా ఉండాలో అర్ధం కావటం లేదనే భావన వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications