నీకూ..నీ తుగ్లక్ ముఖ్యమంత్రికి లోకేష్ నామస్మరణేనా..దొంగ రాజైపోడు? టీడీపీ ఫైర్
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం శృతి మించుతోంది. ప్రత్యేకించి- వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చేస్తోన్న విమర్శలపై తెలుగుదేశం నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఘాటు వ్యాఖ్యలతో బదులు ఇస్తున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల ట్వీట్ల యుద్ధం అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతోంది. ఆదివారం మరోసారి ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ఈ వివాదంలోకి లాగుతున్నారు టీడీపీ నాయకులు.
లోకేష్ నామస్మరణే తప్ప మరో పని లేదా?
వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలకు తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ను విమర్శించడమే పనిగా ఉందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయసాయి రెడ్డికి, తుగ్లక్ లా తయారైన ముఖ్యమంత్రి రోజూ లోకేష్ నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ ని చూసి తడుపుకొంటున్నారా? అని ఘాటు పదాలతో విమర్శించారు. నిద్ర లేచింది మొదలు లోకేష్ గురించే ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ గురించి ఆలోచించడం ఆపి పరిపాలనపై దృష్టిపెట్టండని సూచించారుు. అధికారమనే కిరీటం పెట్టగానే దొంగ రాజైపొడు విసారెడ్డి అని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లను సంధించారు.

పరిపాలన అంటే పులివెందుల పంచాయతీ కాదు..
పరిపాలనలో ప్రో యాక్టివ్ స్టెప్స్ అనేవి తీసుకోవాలనే విషయాన్ని తుగ్లక్ ముఖ్యమంత్రికి వివరించాలని బుద్ధా వెంకన్న హితవు పలికారు. వర్షాకాలం వస్తోందంటే ముందు డ్రైనేజిలు క్లీన్ చేయించాలని అన్నారు. పారిశుధ్యం నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, దోమలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని తుగ్లక్ సీఎంకు వివరించాలని ఆయన సాయిరెడ్డికి సూచించారు. వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. అవేమీ పట్టించుకోకుండా ఉంటే ప్రజల పరిస్థితి గాలిలో దీపంలా మారుతుందని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ పరమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇదేమీ పులివెందుల పంచాయితీ కాదని చెప్పారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి, పరిపాలన కొనసాగించాలనే నిర్ణయాలను మార్చుకోవాలని అన్నారు.
420 తాతయ్య @VSReddy_MP నీకూ తుగ్లక్ ముఖ్యమంత్రికీ లోకేష్ నామస్మరణ తప్ప ఏ పనీ లేకుండా పోయింది. లోకేష్ ని చూసి తడుపుకుంటున్నారా? లేచింది మొదలు లోకేష్ గురించే ఆలోచిస్తున్నారు. లోకేష్ గురించి ఆలోచించడం ఆపి పరిపాలనపై దృష్టిపెట్టండి. అధికారమనే కిరీటం పెట్టగానే దొంగ రాజైపొడు విసారెడ్డి!
— venkanna_budda (@BuddaVenkanna) September 1, 2019
420 తాతయ్యా @VSReddy_MP గారు మీ తుగ్లక్ కి చెప్పు, పరిపాలనలో ప్రో యాక్టివ్ స్టెప్స్ అనేవి తీసుకోవాలి.అవి తెలియకపోతే, ప్రజల జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. వర్షాకాలం వస్తోందంటే, ముందు డ్రైనేజిలు క్లీన్ చేయించాలి. పారిశుధ్యం పర్ఫెక్ట్ గా ఉండేలా చూడాలి, దోమలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. pic.twitter.com/VksiRaU6LC
— venkanna_budda (@BuddaVenkanna) September 1, 2019
వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలి. ఇవేమీ పట్టించుకోకుండా ఉంటే ప్రజల పరిస్థితి గాలిలో దీపం మాదిరి అవుతుంది. మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయించడానికి ఇదేమీ పులివెందుల పంచాయితీ కాదు , ప్రజల ఆరోగ్యం . వెంటనే అవసరమైన చర్యలు చేపట్టండి.
— venkanna_budda (@BuddaVenkanna) September 1, 2019
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications