కొడాలి నానిపై రామ్మోహన్ నాయుడు ఫైర్ : మడమ తిప్పి - నాలుక మడతేసిన మంత్రి : గుడివాడ వేదికగా..!!
మంత్రి కొడాలి నాని ఇలాకా గుడివాడ వేదికగా ఎంపీ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి కొడాలి నాని పైన ఫైర్ అయ్యారు.తొలిసారి గుడివాడ నియోజకవర్గానికి వచ్చిన రామ్మోహన్ నాయుడు ప్రధానంగా మంత్రి కొడాలి నాని లక్ష్యంగా వ్యాఖ్యలు కొనసాగించారు. రాజకీయ జన్మనిచ్చిన టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు.. పార్టీ అధినేత చంద్రబాబును ఘోరంగా మోసం చేసిన నాయకులు గుడివాడ వైసీపీకి నాయకత్వం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖా మంత్రిగా ఆయన నిర్ణయాల పైన రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

మంత్రి నాని మడమ తిప్పి..నాలుక మడతేసి
సన్న బియ్యం ఇస్తామని చెప్పి తర్వాత మడమ తిప్పి.. నాలుక మడతేసిన మంత్రి అంటూ ఎద్దేవా చేసారు. ఇదే విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే బూతులతో ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడుకున్న దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి మనకు ఉండటం శోచనీయమంటూ వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని, 2024 ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదంటూ జోస్యం చెప్పారు.

చంద్రబాబును మళ్లీ సీఎంగా
2024లో 175 నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులనే నిలిపి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పనిచేయాలని యువ నాయకులకు ఆయన సూచించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న సీఎం జగన్ ఆ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని రామ్మోహన్ ప్రశ్నించారు. విశాఖకు రైల్వే జోన్ కావాలని అడగలేని వైసీపీ ఎంపీలు దేశ రాజధానిలో దద్దమ్మల మాదిరి తయారయ్యారని విమర్శించారు.

గుడివాడ వేదికగా మంత్రిపై ఫైర్
మంత్రి కొడాలి నాని తరచూ టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేశ్ పైన చేస్తున్న వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు రియాక్ట్ అయినా...ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గుడివాడ వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అచ్చెన్నాయుడుని పలు సందర్భాల్లో విమర్శించిన కొడాలి నాని..రామ్మోహన్ నాయుడు పైన ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, గుడివాడ వచ్చిన రామ్మోహన్ నాయుడు..అక్కడి నుంచే కొడాలి నాని తీరు పైన మండిపడ్డారు. ఎలాగైనా గుడివాడ నుంచి కొడాలి నాని గెలవకుండా చూడాలని టీడీపీ గతంలోనే పలు ప్రయత్నాలు చేసింది.
Recommended Video

టీడీపీ టార్గెట్ కొడాలి నాని..ఎలాగైనా
అప్పటి వరకు పోటీ చేస్తున్న రావి కుటుంబాన్ని కాదని... దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అనివాశ్ ను పోటీకి దింపింది. అయినా..నాని మరోసారి గెలిచి మంత్రి అయ్యారు. ఇప్పుడు అవినాశ్ సైతం వైసీపీలో చేరారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంగా చెప్పుకొనే ఇక్కడ నానిని ఓడించేందుకు ఎవరిని బరిలో దించాలనే అంశం పైన టీడీపీలో పలు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే, అసెంబ్లీ లోపలా .. బయటా టీడీపీ అధినాయకత్వాన్ని మంత్రి నాని టార్గెట్ చేసినట్లుగా మరే వైసీపీ నేత చేసి ఉండరనే వాదన పార్టీలో బలంగా ఉంది. ఇక, తాజాగా పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ లోనూ పవన్ పైన మంత్రి నాని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యల పైన కొడాలి నాని ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications