భగ్గుమన్న గుడివాడ: టీడీపీ-వైసీపీ ఘర్షణ: మా దగ్గర అంతకంటే పెద్ద రాళ్ళే ఉన్నాయ్

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు రావి వెంకటేశ్వరరావుకు బెదిరింపు ఫోన్ కాల్ రావడమే దీనికి కారణం. తనతో పాటు తన అనుచరులు, టీడీపీ నాయకులపై దాడికి కూడా ప్రత్నించారని రావి వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ దాడుల వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉందని ఆయన విమర్శించారు.

Gudivada

సోమవారం వంగవీటి రంగా వర్ధంతి. దీన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రావి వెంకటేశ్వర రావు, ఇతర టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే దారుణ హత్య జరిగిందని వైసీపీ నాయకులు విమర్శిస్తోన్నారు.

అలాంటి టీడీపీకి వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించే హక్కు లేదని వైసీపీ గుడివాడ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. గుడివాడలోని టీడీపీ పార్టీ కార్యాలయం సమీపంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్ల పట్ల వైసీపీ నాయకులు అభ్యంతరం చెప్పడం- ఘర్షణకు దారి తీసింది. వైసీపీ నాయకులకు రావి వెంకటేశ్వర రావు వర్గీయులు అడ్డుకోవడంతో ఈ రెండు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారి తీసింది.

ఈ విషయం తెలియడంతో రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. కొడాలి నాని అనుచరుడు కాళీ.. టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. అసభ్య పదజాలంతో దూషించారని విమర్శించారు. ఘర్షణ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇరు పక్షాల వారిని చెదరగొట్టారు. లాఠీ ఛార్జీ చేశారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీనితో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Gudivada

ఈ ఘటన పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. స్థానిక శాసన సభ్యుడు, మాజీ మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ధ్వజమెత్తారు. గడ్డం గ్యాంగ్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆ గ్యాంగ్ కు గుండు కొట్టించే రోజు అతి దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ గొడవకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను నారా లోకేష్ తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తమ వద్ద అంతకంటే పెద్ద రాళ్లే ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+