టిక్‌టాక్ తీసిన ప్రాణాలు: భర్త మందలింపుతో భార్య ఆత్మహత్య, ఆ తర్వాత కొడుకు

విజయవాడ: వినోదపు యాప్ టిక్‌టాక్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టిక్‌టాక్‌కు బానిసగా మారుతున్నావంటూ భర్త మందలించడం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చనిపోయిందనే విషయం తెలిసి ఆమె కుమారుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, ఎప్పుడూ అతని భార్య టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తుండటంతో ఆమెను మందలించాడు భర్త.

tiktok deaths: mother son commits suicide in vijayawada.

ఇకపై టిక్ టాక్ వీడియోలు చేయొద్దంటూ గట్టిగా చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె అందరూ పడుకున్న తర్వాత అర్థరాత్రి వేళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయింది.

తల్లి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడు సైనైడ్ తాగి కుప్పకూలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారు. గంటల వ్యవధిలోనే తల్లీకొడుకుల మరణంతో ఆ కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+