ఎమ్మెల్సీ పోరులో వైసీపీ ఓటమికి అసలు కారణాలివే-వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్..!
గన్నవరం : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఓటమిపై ఆ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ ద్వారా వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని గుర్తించారని ఆయన తెలిపారు. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, టీడీపీ నుంచి దూరంగా ఉన్న నలుగురు ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారని వంశీ తెలిపారు. ఎమ్మెల్యేలకు క్యాష్ వచ్చింది...టీడీపీ వాళ్ళకి ఓటు వచ్చిందంటూ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ ఎక్స్ బాస్ (చంద్రబాబు) మైండ్ గేమ్ ఆడటంలో దిట్ట అని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. గతంలో చంద్రబాబు తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎలా ప్రయత్నించారో అందరికీ తెలుసన్నారు. ఈ ఉదంతంతో హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి ఎలా వచ్చారో తెలుసన్నారు. చంద్రబాబు ఎంత మైండ్ గేమ్ ఆడినా ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తెలిసిపోయిందన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి సూటిగా ఎమ్మెల్యేలను ప్రశ్నించడంలో అసంతృప్తితో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేశారని వంశీ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదని తెలుసుకున్నఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేశారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలకు వరకే పరిమితం రాజకీయాలు వేరు సినిమా వేషాలు వేరన్నారు. బాలకృష్ణ తాజా డైలాగులపై వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు డబ్బులు దండుకున్నారు అందుకే ఎక్స్ బాస్ కి పదవి వచ్చిందన్నారు.
ఎమ్మెల్సీ పోరులో వైసీపీ ఓటమికి అసలు కారణాలివే - వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్..!!#VallabhaneniVamsi #Chandrababu #TDP #YSRCP #MLCElectionsInAP #ApMLCElections2023 #MLCElections2023 #Oneindiatelugu pic.twitter.com/Z9TniDTjb8
— oneindiatelugu (@oneindiatelugu) March 24, 2023












Click it and Unblock the Notifications