టీడీపీకి షాకిచ్చిన వంగవీటి రాధా .. జనసేనానితో భేటీ .. జనసేనకు జంప్

ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ నుండి నేతలు వలసబాట పట్టారు. ఎవరు ఏ పార్టీలోకి జంప్ అంటున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇక విజయవాడ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే వంగవీటి రాధాకు జంప్ అవ్వటానికి రెడీ అయినట్టు తెలుస్తుంది .

విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి.. వంగవీటి రాధా షాకింగ్ నిర్ణయం

విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి.. వంగవీటి రాధా షాకింగ్ నిర్ణయం

వంగవీటి రాధా.. వై సీపీ లో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీ అధినేత తీరుతో పార్టీ మారి టీడీపీలో చేరారు. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావటంతో వంగవీటి పరిస్థితి మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. ఇక వంగవీటి తాజాగా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన రాధాకృష్ణ .. గంటకుపైగా చర్చ

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన రాధాకృష్ణ .. గంటకుపైగా చర్చ

సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వంగవీటి రాధా ఇప్పుడు జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే..ఆయన త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాధా త్వరలో జనసేనలో చేరబోతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఇవాళ జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. టీడీపీ నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చే సమయంలో ముందు జనసేనలోనే చేరతారని అందరూ భావించారు . కానీ రాధా చేరలేదు . అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఆయన పవన్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే పవన్ తో భేటీ అయిన ఆయన దాదాపు గంటకు పైగా వీరిద్దరి సమావేశం అయ్యారు . మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్‌ని కలిశారు వంగవీటి రాధా.

 జనసేనకు జంప్ అవుతున్న వంగవీటి రాధా... నేడో, రేపో పార్టీ మారే అవకాశం

జనసేనకు జంప్ అవుతున్న వంగవీటి రాధా... నేడో, రేపో పార్టీ మారే అవకాశం

వైసీపీ నుండి టీడీపీలో చేరిన వంగవీటి రాధా జగన్ కు వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి రాకపోవటంతో టీడీపీని వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు పార్టీ మారుతున్న నేపధ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో రాధా బేటీ అవటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది . వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలిగేవారు. అంతే కాదు సామజిక వర్గం పరంగా కూడా ఆయన కాపు నేతే .. ఇప్పుడు వీరిద్దరి భేటీ లో ఏం నిర్ణయం తీసుకున్నారో త్వరలోనే తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+