బెజవాడ సీపీ వండర్‌ఫుల్ థింకింగ్: నేరస్తులకు జాబ్ మేళా.. ఉపాధి
నేరస్తులపై పోలీసులు జాలి చూపడం రేర్.. వారిని నేరచరిత్ర కలిగినవారిగానే చూస్తారు. ఇందులో సందేహాం లేదు. వారిని పట్టించుకొని, ఉపాధి గురించి ఆలోచించరు. కానీ విజయవాడ పోలీస్ కమిషనర్ మాత్రం నేరస్తుల గురించి ఆరాతీశారు. అంటే వారి యోగక్షేమాలే కాకుండా.. ఉపాధి గురించి కూడా యోచన చేశారు. అంతేకాదు వారికి జాబ్ మేళా కూడా నిర్వహించి.. వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
ది 05.03.2022 న ఉదయం 10.00 ల నుండి సాయంత్రం 4.00 గo ల వరకు షాదీఖానా , అజిత్ సింగ్ నందు నిరక్షరాస్యులకు మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు. (1/2) pic.twitter.com/rUkVtG4Q6H
— Vijayawada City Police (@VjaCityPolice) March 5, 2022
విజయవాడ నగరం రౌడీ షీటర్లకు అడ్డాగా అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గతంతో పోల్చి చూస్తే... నగరంలో రౌడీ షీటర్ల సంఖ్య ఇప్పుడు భారీగానే తగ్గిపోయిందనే చెప్పాలి. రౌడీ మూకల ఆగడాలు కూడా తగ్గడంతో ప్రస్తుతం నగరం ఒకింత ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. గతంలో రకరకాలుగా రౌడీయిజం చేసిన రౌడీలు.. ఇప్పుడు ఇటు రౌడీయిజం చేసేందుకు అవకాశాలు లేక, అటు ఉపాధి లేక నానా పాట్లు పడుతున్నారు. వీరిని పోలీసులు నిత్యం గమనిస్తూనే ఉంటారు.

పలువురు రౌడీ షీటర్లను విచారించిన సందర్భంగా వారి కష్టాలేమిటో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాకు తెలిసాయి. ఆ కష్టాలను కడతేర్చి రౌడీయిజాన్ని వదిలేసిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆలోచించారట. అనుకున్నదే తడవుగా పలు పారిశ్రామిక సంస్థలతో చర్చలు జరిపిన కమిషనర్.. నగరంలో ఓ భారీ జాబ్ మేళాకు రంగం సిద్ధం చేశారు. 16 సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ జాబ్ మేళా శనివారం ఉదయం ప్రారంభమైంది.
జాబ్ మేళాకు చాలా మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు. వారితోపాటు పెద్ద సంఖ్యలో యువత కూడా జాబ్ మేళాకు వచ్చారట. కమిషనర్ ఆశించినట్టుగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు దొరికితే.. రౌడీ షీటర్లు నిజంగానే కొత్త జీవితం ప్రారంభించినట్టే కదా? ఇదీ చాలా మంచి పని.. అవును ఎందుకంటే వారికి కొత్తగా ఉపాధి కల్పిస్తున్నట్టే ఉంది. వారికి ఎలాగూ పని ధ్యాసే ఉండనుంది. దీంతో మళ్లీ నేరాలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వారికి కొత్త జీవితం అందించినట్టే అవుతుంది.