మూలానక్షత్రం రోజు సరస్వతీదేవిగా బెజవాడ దుర్గమ్మ-కేశినేనికి పోలీసుల బ్రేక్-ఇవాళ జగన్ దర్శనం

విజయవాడ కనకదుర్గమ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. వారికి సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనిమిస్తున్నారు. ఇవాళ మూలా నక్షత్రం రోజు కావడంతో పలువురు వీఐపీలు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మ.. సరస్వతీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశిష్ఠమైన రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు. అంతరాలయం, ప్రత్యేక దర్శనం టికెట్లు రద్దు చేసి అందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు.

vijayawada kanakadurga as saraswati devi on mula nakshatram day, police stop mp kesineni convoy

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుటుంబ సమేతంగా సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూల నక్షత్రం రోజున దర్శించుకున్నారు. అయితే ఆయన కాన్వాయ్ ను పోలీసులు ఘాట్ రోడ్ ఆరంభంలోనే అడ్డుకున్నారు. పోలీసు వాహనాలు, వీఐపీ స్టిక్కర్ వాహనాల్ని మాత్రమే అనుమతిస్తున్న పోలీసులు తన వాహనాన్ని అడ్డుకోవడంపై కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన నాని... స్ధానిక ఎంపీగా ప్రోటోకాల్ ఉందని తెలిసి కూడా తన వాహనాన్ని అడ్డుకోవడంతో మనస్తాపం చెందారు. కాసేపు వాగ్వాదం తర్వాత ఆయన మెట్ల మార్గంలో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ - ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలనక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

vijayawada kanakadurga as saraswati devi on mula nakshatram day, police stop mp kesineni convoy

మరోవైపు ఇవాళ సీఎం జగన్ కూడా అమ్మవారి దర్సనానికి వస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇందుకోసం దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పట్టు వస్త్రాల సమర్ఫణ తర్వాత ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. దీంతో పోలీసులు భద్రతను కట్టు దిట్టం చేశారు.

Recommended Video

    AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
    vijayawada kanakadurga as saraswati devi on mula nakshatram day, police stop mp kesineni convoy
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+