కేశినేని నానీ పై బెజవాడ నేతల తిరుగుబాటు .. చెప్పుతో కొట్టే వాళ్ళమని తీవ్ర వ్యాఖ్యలు

ఒకపక్క మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుతుంటే, మరోపక్క బెజవాడ తెలుగు తమ్ముళ్ళ మధ్య రచ్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఎంపీ కేశినేని నాని పై బెజవాడ టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. కేశినేని నాని కావాలో, మిగతా అందరూ కావాలో తేల్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు.

పార్టీ కోసం పని చేసేది మేము .. పదవుల కోసం పనిచేసేది నానీ : బోండా ఉమా

పార్టీ కోసం పని చేసేది మేము .. పదవుల కోసం పనిచేసేది నానీ : బోండా ఉమా

ఎంపీ కేశినేని నాని ప్రవర్తన సరిగా లేదని మాజీ ఎమ్మెల్యే టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కేశినేని నాని పై మండిపడ్డారు. తాము పార్టీ కోసం పని చేస్తుంటే కేశినేని నాని పదవుల కోసం పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ టిడిపికి తానే అధిష్ఠానం అని కేశినేని నాని మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని బోండా ఉమ ఆక్షేపించారు. తన కూతుర్ని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారని, కులాల మధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని బోండా ఉమ కేశినేని నానిని విమర్శించారు.

దమ్ముంటే ఇండిపెండెంట్ గా గెలువ్ .. కట్టు బట్టలతో బెజవాడ వదిలిపోతా : ఉమా సవాల్

దమ్ముంటే ఇండిపెండెంట్ గా గెలువ్ .. కట్టు బట్టలతో బెజవాడ వదిలిపోతా : ఉమా సవాల్


నిజంగా బెజవాడ పార్లమెంట్లో కేశినేని నానికి సత్తా ఉంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని బోండా ఉమా పేర్కొన్నారు. నాని ఇండిపెండెంట్గా పోటీచేసి గెలిస్తే కట్టుబట్టలతో విజయవాడ వదిలి వెళ్ళిపోతానని బోండా ఉమా సవాల్ చేశారు . కేశినేని నాని ముఖ్యమనుకుంటే తాము రేపు జరగబోయే చంద్రబాబు టూర్ కు దూరంగా ఉంటామని బోండా ఉమ హెచ్చరిస్తున్నారు. కేశినేని నాని కావాలో అందరూ కావాలో తేల్చుకోవాలి అంటూ బోండా ఉమా చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు.

 చంద్రబాబు అని ఏకవచన ప్రయోగం .. ఆ రోజే చెప్పుతో కొట్టేవాడ్ని : బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు అని ఏకవచన ప్రయోగం .. ఆ రోజే చెప్పుతో కొట్టేవాడ్ని : బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే కేశినేని నాని పై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని తీరుతో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామని చెప్పిన బుద్దా వెంకన్న చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అని చెప్పుకోవడం నానీ అహంకారానికి నిదర్శనం అని పేర్కొన్నారు . కేశినేని నానిని తాను ఆ రోజే చెప్పుతో కొట్టే వాడినని, చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానని బుద్దా వెంకన్న తీవ్రవ్యాఖ్యలు చేశారు. నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావ్ .. దమ్ముంటే రా నువ్వొ నేనో తేల్చుకుందాం అంటూ కేశినేని నాని పై నిప్పులు చెరిగిన బుద్దా వెంకన్న రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నారు అని మండిపడ్డారు.

 పార్టీకి బడుగు బలహీన వర్గాలను దూరం చేస్తున్న కేశినేని నానీ : మండిపడిన నాగుల్ మీరా

పార్టీకి బడుగు బలహీన వర్గాలను దూరం చేస్తున్న కేశినేని నానీ : మండిపడిన నాగుల్ మీరా

టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా కేశినేని నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని కుల అహంకారంతో మాట్లాడుతున్నారని బడుగు బలహీన వర్గాలను కించపరుస్తున్నారని ఆక్షేపించారు . పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లం తామని పేర్కొన్న నాగుల్ మీరా, నాని తీరుతో విసిగి పోయామని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును అధికార పార్టీ నేతలు తిడుతున్నా నోరెందుకు మెదపడం లేదని కేశినేని నానిని ప్రశ్నించారు. కేశినేని నాని ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు పట్టుకొమ్మలని అటువంటి కొమ్మలనే కేశినేని నాని నరికేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

 ఆత్మాభిమానాన్ని చంపుకుని పార్టీలో ఉండలేం .. ఎవరు కావాలో తేల్చుకోండి : బాబుకు అల్టిమేటం

ఆత్మాభిమానాన్ని చంపుకుని పార్టీలో ఉండలేం .. ఎవరు కావాలో తేల్చుకోండి : బాబుకు అల్టిమేటం

బడుగు బలహీన వర్గాలు మీ చెప్పుచేతల్లో ఉండాలా అంటూ ప్రశ్నించిన నాగుల్ మీరా, ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీలో ఇమడలేక పోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం మీద బెజవాడ రాజకీయాలు కేశినేని నాని పై తెలుగు తమ్ముళ్ల తీవ్ర వ్యాఖ్యలతో రచ్చగా మారింది. ఒక పక్క ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతుంటే, బెజవాడ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన చోట తెలుగు తమ్ముళ్లు రోడ్డున పడి వ్యాఖ్యలు చేసుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రచ్చ చేయడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. నాని కావాలో మేం కావాలో తేల్చుకోమని చంద్రబాబుకు టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేయడం బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది . ఇదే అదునుగా వైసిపి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+