40 మంది జైలుకా- 16 నెలలుగా మీరక్కడేగా- లోకేష్‌కు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో త్వరలో అధికార వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు జైలుకెళ్తారంటూ టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హత్య కేసులో జైల్లో ఉన్న వారిని పరామర్శించేందుకు లోకేష్ ఏపీకి వచ్చారని, ప్రజల కోసమేమీ రాలేదన్నారు.
ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక్క ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు నిరూపించాలని కోరారు. సవాల్ చేసి హైదరాబాద్‌కు పారిపోవడం కాదని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లోకేష్‌కు జోగి రమేష్ సూచించారు. టీడీపీ చేసిన పాపాలకు ప్రజలు 16 నెలలుగా జైల్లోనే కూర్చోబెట్టారన్నారు. లోకజ్ఞానం లేని లోకేష్ సీఎం జగన్ తాత రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారని, ఆయన గురించి ఏం తెలుసని జోగి రమేష్ ప్రశ్నించారు. రాజారెడ్డి పేదల పెన్నిథి అని ఆయన రాజకీయాలు చేసినప్పుడు లోకేష్ పుట్టలేదన్నారు.

Recommended Video
ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో లోకేష్ హైదరాబాద్‌లో ఉండటాన్ని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పుబట్టారు. కరోనా ఉన్నా సరే ప్రజల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ నేతలు మాత్రం కరోనాకు భయపడి హైదరాబాద్‌కు పాతిపోతారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయానికి తాళాలు వేసి ఆరునెలలు అయిందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు రాబందుల్లా, అక్కుపక్షుల్లా కోర్టులకెళ్లి అడ్డుకున్నారని జోగి రమేష్ విమర్శించారు. 14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు చేయలేని పనిని జగన్ ఏఢాదిలోనే చేశారని, ఇళ్ల స్ధలాలు ఇస్తే లోకేష్‌కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా అని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications