విశాఖ- విజయవాడ మధ్య రద్దయిన రైళ్లు: జాబితా ఇదే: వందే భారత్ ఆలస్యం
విశాఖపట్నం: విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ మార్గంలోని తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య ఈ తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. కొన్ని మీటర్ల వరకు పట్టాలు ధ్వంసం అయ్యాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
బొగ్గును మోసుకెళ్తోన్న గూడ్స్ రైలు అది. తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో తాడి- అనకాపల్లి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే డివిజినల్ రైల్వే మేనేజర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టాల మరమ్మతు పనులు చేపట్టారు. కొన్ని మీటర్ల మేర పట్టాలు ధ్వంసం అయ్యాయి. అయిదు ర్యాక్స్ భూమిలోకి దిగిపోయాయి.

ఈ ఘటనతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రభావితం అయ్యాయి. అయిదు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు. 180 నిమిషాలు అంటే మూడు గంటల పాటు ఆలస్యంగా నడుస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
నంబర్ 12805 విశాఖపట్నం- లింగంపల్లి, 12806 లింగంపల్లి- విశాఖపట్నం, 22701 విశాఖపట్నం- విజయవాడ, 22702 విజయవాడ- విశాఖపట్నం, 17240 విశాఖపట్నం- గుంటూరు, 17239 గుంటూరు- విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి. ఇక ఇవ్వాళ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరి వెళ్లాల్సిన నంబర్ 20833 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రీషెడ్యూల్ చేశారు. షెడ్యూల్ కంటే మూడు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరుతుంది ఈ ఎక్స్‌ప్రెస్.












Click it and Unblock the Notifications