Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కంటినొప్పితో ఆసుపత్రికి వెళ్లింది..స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లకు కళ్లు బైర్లు కమ్మాయ్

విశాఖపట్నం: కొద్దిరోజులుగా కంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువతి చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులు రాసిచ్చారు. సుమారు రెండువారాలుగా డాక్టర్లు రాసిచ్చిన మందులను వాడుతున్నప్పటికీ.. కంటి లోపలి పొరల్లో ఆరంభమైన ఆ నొప్పి తగ్గుముఖం పట్టలేదు. దీనితో ఆ యువతి శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె కంటికికి స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన తరువాత డాక్టర్లకు కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. కారణం..

ఆమె కంటి లోపలి పొరల్లో నులి పురుగు తిరుగాడుతుండటమే. ఆ నులిపురుగు చిన్న, చితకది కూడా కాదు. ఏకంగా 15 సెంటీమీటర్ల నులి పురుగు అది. వెంటనే డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించి, దాన్ని తొలగించారు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఆ యువతి పేరు భారతి. పెందుర్తిలో నివాసం ఉంటున్నారు. కంటి నొప్పికి స్థానిక డాక్టర్ రాసిచ్చిన మందులు వాడినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోవడంతో ఆమె శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు.

A 15 cm length warm found in young women eye, removed after operation

ఈ సందర్భంగా ఆమెకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన అక్కడి సీనియర్ డాక్టర్ నజరిన్‌ వెంటనే శస్త్రచికిత్స చేశారు. నులి పురుగు కావడం వల్ల ఓ చోట స్థిరంగా ఉండలేదు. దీనికోసం రెండుసార్లు ఆపరేషన్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు దాన్ని బయటికి తీయగలిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+