విశాఖలో మరో కలకలం: రుషికొండ బీచ్ సమీపానికి: 2 కిలోమీటర్ల పొడవునా: ఆక్సిజన్ అందకే

విశాఖపట్నం: పారిశ్రామికంగా వరుస ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరికి గురవుతోన్న విశాఖపట్నంలో తాజాగా మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపింది. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన రుషికొండ తీర ప్రాంతానికి వేలాదిగా మృత చేపలు కొట్టుకుని వచ్చాయి. రుషికొండ, సాగర్ నగర్ బీచ్‌ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా మృత చేపలు కుప్పగా పోగయ్యాయి.

ఉదయం నుంచీ సాయంత్రం దాకా నిర్జీవ చేపలు కొట్టుకుని రావడం కనిపించింది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పల వల్లే అవి మరణించినట్లు అనుమానిస్తున్నారు. దీనికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తీర ప్రాంతానికి కొట్టుకుని వచ్చిన వాటిిల్లో చాలా మటుకు సిల్వర్ బెల్లీ ఫిష్‌లు ఉన్నట్లు విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కే ఫణి ప్రకాష్ తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే అవి మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు.

A large number of dead fish washed ashore at Rushikonda beach in Visakhapatnam

అయిదారు రోజులుగా విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఫలితంగా వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల చేపలు మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. బంగాళాఖాతం ఉపరితలంపై క్రమం తప్పకుండా ఏర్పడుతోన్న ఆవర్తనాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ఆక్సిజన్ శాతం క్షీణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కాలుష్యం వల్ల చేపలు మరణించాయనడానికి ఆధారాలు లేవని ఫణి ప్రకాష్ తెలిపారు. 2010లో అప్పికొండ తీర ప్రాంతానికి ఇలాగే వందలాది మృత చేపలు కొట్టుకొచ్చాయని గుర్తు చేశారు.

అయినప్పటికీ.. వేల సంఖ్యలో చేపల మరణించడానికి గల కారణాలను అన్వేషిస్తామని అన్నారు. దీనితో ఓ నివేదిక అందజేయాలని భీమిలీ మత్స్య సంపద అభివృద్ధి అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. సిల్వర్ జెల్లీ ఫిష్‌లను సాాధారణంగా కమర్షియల్ కార్యకలాపాల కోసం వినియోగించరని అన్నారు. డ్రై షిష్‌గా, కోళ్లకు ఆహారంగా వినియోగిస్తుంటారని అన్నారు. చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయనే సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానికులు వాటిని సంచుల్లో నింపుకొని తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+