విశాఖ విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్, ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్
భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ విచ్చేశారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం సతీసమేతంగా విశాఖ తీరానికి చేరుకున్నారు. కోవింద్ దంపతులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. ఐఎన్ఎస్ డేగకు సాయంత్రం గంటలు 5.35 నిమిషాలకు రాష్ట్రపతి చేరుకున్నారు. రాష్ట్రపతికి స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా ఇంచార్జీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
Recommended Video

తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. సోమవారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున, AVSM, YSM, VSM, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్ చీఫ్, తూర్పు నౌకాదళ కమాండ్, విశాఖపట్నం, వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రతినిధి వి విజయ సాయి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, బివి సత్యవతి
శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు (గణబాబు), పాఠశాల విద్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బి రాజశేఖర్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్) ఎరవిశంకర్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు," డిఐజి రంగారావు, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్పీ బి కృష్ణరావు, ప్రొటోకాల్ & డిప్యూటి సెక్రటరీ ఎం బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి అరుణ్ బాబు, విఎంఆర్డిఎ కమీషనర్ వెంకట రమణారెడ్డి, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications