కరణ్ అదాని S/o గౌతమ్ అదాని..!!

విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలి రోజు ముగిసింది. ఇవ్వాళ 13 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందాలు కుదిరాయి. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల తరఫున గౌతమ్ అదాని కుమారుడు కరణ్ అదాని హాజరయ్యారు.

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు.

డే- 1 భారీగా..

డే- 1 భారీగా..

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023 తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగంలోనూ భారీగా ఎంఓయూలు నమోదయ్యాయి. 8,718 కోట్ల రూపాయల మేర ఒప్పందాలను ఆయా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు- ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూను కుదుర్చుకున్నారు.

 ప్రత్యేక ఆకర్షణగా..

ప్రత్యేక ఆకర్షణగా..

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని కుమారుడు, అదాని పోర్ట్స్- స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరణ్ అదాని- ఈ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీకి రావడం ఆయనకు ఇదే తొలిసారి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి హాజరు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ అదానిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్వయంగా వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఆహ్వానపత్రాన్ని అందించారు.

రాలేకపోయిన అదాని..

ఈ సమ్మిట్ కు గౌతమ్ అదాని రాలేకపోయారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున కరణ్ అదాని హాజరయ్యారు. సమ్మిట్ ప్రారంభం నుంచి తొలి సెషన్ ముగిసేంత వరకూ ఆయన వేదిక మీదే గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మాట్లాడటం కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సహా ఈ సమ్మిట్ కు వచ్చిన పలువురు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి వేదికపై మెరిశారు.

భారీగా పెట్టుబడులు..

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై కరణ్ అదాని ప్రసంగించారు. భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులును పెట్టినట్లు వివరించారు. వాటి వల్ల 74,000 మంది ఉద్యోగాలు లభించాయని చెప్పారు. అదాని ఫౌండేషన్ ద్వారా 1,80,000 మందికి సేవలను అందించామని అన్నారు. ఇప్పుడు కార్యకలాపాలను సాగిస్తోన్న తమ సంస్థలను ఏపీలో మరింత విస్తరించునన్నట్లు కరణ్ అదాని చెప్పారు.

విస్తరణలు..

విస్తరణలు..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, గంగవరంలల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. ఇప్పుడున్న వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని అదనంగా మరో 100 మిలియన్ టన్నులకు పెంచనున్నట్లు తెలిపారు. ఏపీలో ఉన్న అదాని గ్రీన్ రెన్యూవబుల్ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని 15 గిగావాట్లకు పెంచుతామని అన్నారు. అంబుజా సిమెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా 10 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+