విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింహాచలం ఆస్తుల్ని మీరెలా క్రమబద్దీకరిస్తారు ? జగన్ సర్కార్ కు హైకోర్టు ప్రశ్న-పేదలకు పంచేస్తారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీప ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఆధిపత్యం ఉన్న మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం భూముల అంశాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఆస్తులకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు ప్రాభవానికి గండికొట్టేందుకు ఆయనతో సంబంధం లేకుండా ఆక్రమణల క్రమబద్ధీకరణ సహా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం చట్టాల్నీ మార్చేసింది. దీనిపై హైకోర్టు ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పుబడుతూ కీలక ప్రశ్నలు వేసింది.

సింహాచలం పంచగ్రామాల సమస్య

సింహాచలం పంచగ్రామాల సమస్య

ఉమ్మడి విశాఖ జిల్లాలో సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో పంచగ్రామాలుగా పేరొందిన అడవివరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలగుంట ఉన్నాయి. వీటిలో కొన్నేళ్లుగా పలువురు ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారు. మరికొందరు అమ్ముకున్నారు. ఇలా ఆక్రమించుకున్న వాటిని క్రమబద్ధీకరిస్తామంటూ ప్రభుత్వం ముందుకొచ్చింది. సింహాచలం ట్రస్టుకు చెందిన ఈ భూముల్ని ఎవరో ఆక్రమించుకుంటే ప్రభుత్వం తమ భూములు కాని వీటిలో క్రమబద్ధీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం 2019లోనే చట్టాన్ని కూడా చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు

హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు


సింహాచలం పంచగ్రామాల పరిధిలో జరిగిన ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా హైకోర్టు 2019లో స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వం వీటిని క్రమబద్ధీకరించడానికి వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సవాల్ చేస్తూ సింహాచలం ట్రస్టు తరఫున అశోక్ గజపతిరాజు పోరాడుతూనే ఉన్నారు. ఈ కేసు మరోసారి హైకోర్టులో నిన్న విచారణకు వచ్చింది. దీంతో హైకోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది.

సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సింహాచలం పంచగ్రామాల పరిధిలో ఉన్న ట్రస్టు భూముల్ని ఎవరో ఆక్రమించుకుంటే వాటిని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం చట్టాలు చేయడం, ఈ మేరకు జరుగుతున్న ప్రయత్నాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీవి కాని భూముల్ని ఎలా క్రమబద్ధీకరిస్తారంటూ ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. హైకోర్టు ప్రశ్నలకు స్పందించిన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం.. క్రమబద్ధీకరణ ద్వారా వచ్చిన సొమ్మును దేవస్ధానానికి జమ చేస్తామని, అలాగే దేవస్ధానం కోల్పోయిన భూములకు ప్రత్యామ్నాయం చూపుతామని వాదించారు. ఏళ్ల తరబడి ఈ భూముల ద్వారా దేవస్ధానానికి ఆదాయం కూడా రావడం లేదని, క్రమబద్ధీకరణతో ఆదాయం వస్తుందన్నారు.

జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ప్రశ్న

జగన్ సర్కార్ కు హైకోర్టు కీలక ప్రశ్న


అదే సమయంలో సింహాచలం దేవస్ధానం ఆలయ ఈవో తరఫు న్యాయవాది కూడా ప్రభుత్వ వాదనకు మద్దతుగా వాదన వినిపించారు. ఆక్రమణదారుల్ని ఖాళీ చేయించి పరిస్దితి లేదని, క్రమబద్దీకరిస్తే కనీసం ఆదాయమైనా వస్తుందన్నారు. దానిపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం, దేవస్ధానం కుమ్మక్కై క్రమబద్ధీకరణకు ప్రయత్నిస్తున్నాయా అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే దేవస్ధానం భూముల్ని తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి, ప్రత్యామ్నాయంగా తక్కువ విలువైన భూముల్ని దేవస్ధానానికి అప్పగించే ప్రమాదం లేకపోలేదని తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ప్రశ్నలువేసింది. మీది కాని భూమిని మీరెలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ప్రైవేటు ఆస్తుల్ని పేదలకు పంచేస్తామంటారంటూ వ్యాఖ్యానించింది. దీనిపై 25న తుది వాదనలు వింటామని తెలిపింది.

English summary
ap high court raised serious questions on state govt over simhachalam lands regularisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X