విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మట్టి కొట్టుకుపోతావ్.. రేయ్, పై అధికారిపై ఇసుక పోసి నిరసన..

|
Google Oneindia TeluguNews

చేసే పనిని బట్టి స్ట్రెస్ ఉంటుంది. ఒత్తిడితో ప్రతీ ఒక్కరు పనిచేయాల్సిందే. అయితే కొన్నిసార్లు అంచనాలు తలకిందులు అవుతాయి. పై అధికారులపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తారు. దాడులకు కూడా వెనకాడరు. చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి ఘటనుల మనం చూశాం.. చర్చించుకున్నాం.. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి ఒక ఘటన జరిగింది.

చేదు అనుభవం

చేదు అనుభవం

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్ కమిషనర్ అతనితో దురుసుగా ప్రవర్తించారు. ముఖాన ఇసుక తీసుకుని కొట్టడంతో దిగ్భ్రాంతికి గురవ్వాల్సిన పరిస్థితి. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తోన్న పుష్పవర్ధన్.. తన కింది సిబ్బంది వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనేక పర్యాయాలు వారిని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

శాంతికి అవమానం..

శాంతికి అవమానం..

మందలింపులకు గురైన వారిలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కూడా ఉన్నారు. శాంతిని తన చాంబర్‌కు పిలిపించిన పుష్పవర్ధన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సహనం కోల్పోయిన శాంతి, తాను తీసుకువచ్చిన ఇసుకను కోపంతో ఆయనపై చల్లారు. దీంతో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇన్సిడెంట్‌పై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇన్సిడెంట్ మాత్రం తీవ్ర కలకలం రేపింది. వేధింపులకు గురి చేయగా.. ఇసుక వేయడం చర్చానీయాంశమైంది.

మానసికంగా వేధింపులు

మానసికంగా వేధింపులు

డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని శాంతి వివరించారు. అతని తీరు దారుణంగా ఉందని ఆమె ఆరోపించారు. వ్యక్తిగత కక్షలను మనసులో ఉంచుకుని వేధించాడని, మానసిక వేదన భరించలేకే అతడిపై ఇసుక చల్లాల్సి వచ్చిందని తెలిపారు. పుష్పవర్దన్‌పై ఇప్పటికే కమిషనర్ కు ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. కానీ విచారణకు పిలిస్తే రాకుండా తన న్యాయవాదితో వస్తానని తప్పించుకున్నాడని ఆరోపించారు. తప్పేమీ లేకపోతే కమిషనర్ పిలిచిన సమయంలో విచారణకు ఎందుకు రాలేదని శాంతి ప్రశ్నించారు.

ఇసుక పోసి మరీ

ఇసుక పోసి మరీ


పై అధికారిపై ఇసుక పోసి నిరసన తెలిపారు శాంతి. కానీ ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇద్దరు కూడా మంచి పోజిషన్‌లో ఉన్నవారే కావడం విశేషం. శాఖపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనపై స్పందించలేదు.

English summary
asst commissioner throw sand deputy commissioner face at vizag office. he harrassed me woman officer shanti said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X