వైజాగ్ లో 30 ఏళ్ల పాటు పౌరవిమానాలు బంద్ - కేంద్రం..!!
విశాఖలో పౌర విమాన సర్వీసులకు సంబంధించి కేంద్రం కీలక అంశాలను వెల్లడించింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్ నావల్ ఏయిర్ ఫీల్డ్ లో 30 ఏళ్ల పాటు పౌర విమానయాన సేవలు బంద్ అవుతాయని కేంద్ర పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. లోక్ సభలో ఎంపీ రఘురామ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాలను వివరించారు. 2016లోనే భోగాపురం ఏరియ్ ఫీల్డ్ ఏయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం స్థల అనుమతి ఇచ్చిందని గుర్తు చేసారు. ఇదే సమయంలో వైజాగ్ ఏయిర్ పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అమల్లోకి వచ్చేదీ వివరించారు.

30 ఏళ్ల పాటు విశాఖకు విమానాలు బంద్
ఒక్క సారి భోగాపురం విమానాశ్రయంలో సేవలు మొదలైతే ఇప్పుడున్న నావల్ ఎయిర్ ఫీల్డ్ లో షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు 30 ఏళ్ల పాటు నిలిపివేస్థారన్న షరతుతోనే ఈ అనుమతులు ఇచ్చామని స్పష్టం చేసారు. ఏపీ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంతో చేపడుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం - ప్రాజెక్టు గుత్తేదారు మధ్య 2020, జూన్ 12న ఒప్పందం జరిగిందని వివరించారు. అదే సమయంలో విశాఖ ఏయిర్ పోర్టులో ఉన్న సివిల్ ఎన్ క్లేవ్ కి చెందిన భూమిని ఏయిర్ పోర్టు అథారిటీ ఆప్ ఇండియా పేరు మీద మార్చి అప్పగించేలా అవగాహన ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రభుత్వానికి అనుమతులు
ఈ ఒప్పందానికి లోబడే ప్రస్తుత వైజాగ్ నావల్ ఎయిర్ ఫీల్డ్ లో 30 ఏళ్ల పాటు షెడ్యూల్డ్ వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయటానికి పౌరవిమానాయన శాఖ సెప్టెంబర్ లో ఏపీ ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసిందని కేంద్ర మంత్రి వీకే సింగ్ లోక్ సభలో వెల్లడించారు. భోగాపురం విమానశ్రయానికి గత నెలలో ప్రధాన విశాఖ పర్యటన సమయంలోనే శంకుస్థాపన చేయాలని భావించారు. అయితే, ముందస్తు ఏర్పాట్లు కాకపోవటంతో వాయిదా వేసుకున్నారు. జనవరి నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే హైకోర్టు తీర్పుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణ వివాదం కొలిక్కి వచ్చింది. రైతులకు పరిహారం చెల్లింపు, ఇతర ప్రక్రియ పూర్తి చేయడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది.

వచ్చే నెలలో శంకుస్థాపన
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి వచ్చేనెలలో సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని పార్టీ నేత..టీటీడీ ఛైర్మన్ వైవీ సబ్బారెడ్డి రెండు రోజుల క్రితం వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కరించుకొని వచ్చే ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలనా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేయటం ద్వారా దశల వారీగా విమానాశ్రయం పనులు పూర్తి చేయనున్నారు. ఇక, ఇప్పుడు భోగాపురం అందుబాటులోకి రావటం ద్వారా విశాఖలో పౌర విమానాలు నిలిచిపోనున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications