విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

28న విశాఖకు జగన్: ఆ ప్రకటన తరువాత తొలిసారిగా: టీడీపీ నుంచి చేరికలకు ఛాన్స్?

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. పరిపాలనాపరమైన రాజధానిగా ప్రకటించిన తరువాత ఆయన విశాఖపట్నానికి వెళ్లబోతుండటం ఇదే తొలిసారి. రాజధాని అమరావతి ప్రాంత రైతులు తమ నిరసనలను తీవ్రతరం చేస్తోన్న వేళ..వైఎస్ జగన్ విశాఖపట్నాకి వెళ్లనుండటం ఆసక్తి రేపుతోంది. విధానపరమైన నిర్ణయాలను ఆయన వెల్లడించే అవకాశాలు లేకపోలేదు.

జగన్ భావోద్వేగం: మీ బిడ్డగా..పులివెందులపై వరాల సునామీ: మెడికల్ కాలేజీ..డాక్టర్ వైఎస్సార్ గా..!జగన్ భావోద్వేగం: మీ బిడ్డగా..పులివెందులపై వరాల సునామీ: మెడికల్ కాలేజీ..డాక్టర్ వైఎస్సార్ గా..!

విశాఖలో బిజీగా

విశాఖలో బిజీగా

విశాఖపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. కొన్నింటిని ప్రారంభించబోతున్నారు. విశాఖ ఉత్సవ్-2019 కార్నివాల్ ను జగన్ ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు ఈ కార్నివాల్ కొనసాగుతుంది. కైలాసగిరిలో నక్షత్ర శాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే- వైఎస్ఆర్ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను ప్రారంభిస్తారు. సిరిపురంలో ఎనిమిది అంతస్తుల పార్కింగ్ భవనం, ముడిసర్లోవ రిజర్వాయర్ పునరుద్ధరన పనులను ప్రారంభిస్తారు.

టీడీపీలో గుబులు.

టీడీపీలో గుబులు.

ఇదిలావుండగా.. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా ఆయన ఈ నగరానికి వెళ్లబోతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. భారీగా చేరికలు ఉండటానికి అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వైఎస్ జగన్ చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు స్వాగతించారు. ఈ మేరకు వారొక తీర్మానాన్ని సైతం ఆమోదించారు.

చేరికలకు అవకాశం?

చేరికలకు అవకాశం?

ఈ పరిస్థితుల్లో టీడీపీ నుంచి భారీగా వలసలు ఉండొచ్చని అంటున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. దీనికి అనుగుణంగా.. ఇప్పటికే మాజీమంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తున్నారు. టీడీపీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇదివరకే వార్తలు సైతం వచ్చాయి.

 గంటా.. వైసీపీ కండువా

గంటా.. వైసీపీ కండువా


తాజాగా పరిణామాల నేపథ్యంలో- ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన మరుక్షణమే గంటా శ్రీనివాసరావు దీన్ని స్వాగతించారు. వైసీపీ కండువాను కప్పుకోవడమే ఆలస్యమని అంటున్నారు. మంగళవారం రాత్రి విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. తోటి టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణబాబు, గణేష్ కుమార్ సైతం ఆయనకే మద్దతు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో వారంతా గంటా వెంటే నిలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy will visits Visakhapatnam on 28th of December. This will be YS Jagan's first visit after he declared as Visakhapatnam as Administration Capital City of Andhra Pradesh. All eyes on his visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X